వీడియో: వధువును ఆవహించిన దెయ్యం.. పెళ్లి పీటల మీదే వింత ప్రవర్తన..

ఇంటర్నెట్‌లో చాలా ఫన్నీ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి, అవి చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటారు.ఇక ఫన్నీ పెళ్లి వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతాయి.

 Ghost Possessed Bride Scared Everyone Funny Video Viral Details, Viral Video, Vi-TeluguStop.com

వీటిని చూసేందుకు ఇంటర్నెట్ యూజర్లు బాగా ఆసక్తి చూపిస్తారు.ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో, వధువు( Bride ) వరమాల ముందు దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది, వరుడు ఆమె ప్రవర్తనకు బెంబేలెత్తిపోతాడు.

వీరి వీడియో సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్‌గా మారింది, అందులో వధువు చాలా భయంకరంగా, ఫన్నీగా ప్రవర్తిస్తుంది.ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.వైరల్ వీడియోలో వధువు వరుడిని చూసిన వెంటనే, ఒక దెయ్యం ( Ghost ) తనలోకి ప్రవేశించినట్లు నటించడం ప్రారంభిస్తుంది.

వధువు భయంకరమైన ముఖ కవళికలు, వంకర టింకర శరీర భంగిమలతో అందరినీ భయపెడుతుంది.వరుడు కూడా ఆమె భయంకరమైన రూపాన్ని చూసి భయపడి గాలిలోకి దూకుతాడు.వధువు దెయ్యం ఆవహించినట్లు ప్రవర్తించిన తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తుంది.ఏంటి విడ్డూరం అనుకుంటూ వారిని నోరెళ్ల బెట్టేలా చేస్తుంది.

కొంతమంది ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ ఫలితం ఉండదు.

వధువు భయంకర రూపంతో అందరిలో వణుకు పుట్టించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అయిన తర్వాత, నెటిజన్లు వీడియో కింద కామెంట్ల వర్షం కురిపించారు.చాలా మంది నవ్వుతున్న ఎమోజీలతో స్పందిస్తూ వీడియోను చాలా ఫన్నీగా భావించారు.అరేయ్ భాయ్, ఇవేం పిచ్చి పనులు! అని ఒక వ్యక్తి అనగా.

ప్రీ స్క్రిప్టెడ్ వీడియోలా ఉంది అని ఇంకొందరు పేర్కొన్నారు.కొంతమంది ఈ వీడియోను ఒక ఫన్నీ స్టంట్‌గా భావించగా, మరికొందరు దీనిని కొంచెం భయానకంగా భావించారు.

ఇంతకీ వధువు ఎందుకలా ప్రవర్తించింది? పెళ్లి ఇష్టం లేక అలా చేసిందా లేదంటే ఇది వ్యూస్ కోసం చేసిన ఒక పబ్లిక్ స్టంట్‌హా? అనేది తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube