ఏపీలో సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసింది.ఫలితాల కోసమే అంత వెయిటింగ్.
జూన్ 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో వైసిపి ( YCP ) ఉండగా, వైసీపీ పాలనపై జనాలు విసుగెత్తిపోయారని, కచ్చితంగా టిడిపి, జనసేన ,బిజెపి కూటమి నే గెలిపిస్తారని , కూటమిలోని పార్టీలు ధీమాతో ఉన్నాయి.
ఎవరికి వారు గెలుపు పై ఈ ధీమాను ప్రదర్శిస్తున్నారు .
ఇది ఇలా ఉంటే వైసిపి మరో అడుగు ముందుకేసి జగన్( Jagan ) రెండో ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది.ఇప్పటికే జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటన చేయడంతో, వైసిపి నాయకులు దీనికి అనుబంధంగా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.కచ్చితంగా తము గెలుస్తామని, అందుకే జగన్ అంత ధీమా గా ప్రమాణ స్వీకారం విశాఖలో చేస్తామని చెప్పారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇది ఎలా ఉంటే వైసిపి కీలక నేత వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) తాజాగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవ వ్యవహారంపై స్పందించారు.వచ్చే నెల 9వ తేదీన ఉదయం 9.30 కి ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తాజాగా వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.ఏర్పాట్లు కౌంటింగ్ తరువాత ప్రారంభిస్తారా లేక ముందుగానే చేస్తారా అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఇంత హడావుడిగా ప్రమాణస్వీకారం ప్రకటనలు చేయడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉన్నా .ముందు నుంచే ప్రమాణస్వీకారం ముహూర్తాన్ని ప్రకటిస్తూ మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని వైసిపి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు.
మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి కూటమి కూడా గెలుపు పై అంతే స్థాయిలో ధీమాతో ఉంది .కానీ వైసిపి ముందుగానే ప్రమాణస్వీకారం రోజుతో పాటు, ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడంతో, ఈ విషయంలో అంత తొందర ఎందుకు అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.ఎన్నికల ఫలితాలను ఇంకా పూర్తిస్థాయిలో అంచనా వేయకుండానే తొందరపడి ముహూర్తంపై ప్రకటనలు చేయడం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.