ఇటీవల కాలంలో పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) అనే హీరోయిన్ గురించి టాలీవుడ్ లో ఒక విషయం వైరల్ అవుతుంది.అదేంటంటే రక్షణ అనే ఒక సినిమా కోసం ఆమె 50 రోజులు డేట్స్ ఇచ్చిందట.
అందులో సదరు సినిమా కోసం 47 రోజులు వాడుకొని మూడు రోజులు ప్రమోషన్స్ కోసం అలాగే అట్టిపెట్టాడట.అయితే తీరా సినిమా విడుదల తేదీ వచ్చే సరికి ప్రమోషన్స్ కి రమ్మని నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ అడిగాడట.
దాంతో బకాయి ఉన్న మిగతా డబ్బు ఇవ్వలేదు కాబట్టి తాను సినిమా ప్రమోషన్స్ కి రావడం కుదరదు అని చెప్పిందట.దాంతో ప్రొడ్యూసర్ నిర్మాతల మండలి కి కంప్లయింట్ చేశాడట.
అక్కడ వారు చేతులు ఎత్తేయడం తో ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అప్రోచ్ అయ్యాడట.అక్కడ కూడా ఫలితం దక్కకపోవడం తో బెదిరించి అయిన పాయల్ నీ ప్రమోషన్స్ రప్పించాలని చూశాడట.
చంపేస్తా అని కూడా బెదిరించి ఫోన్ చేసి భుతులు కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం వంటి చేసాడంట.చాలా రోజుల పాటు చూసిన పాయల్ నిర్మాత టార్చర్ భరించలేక సోషల్ మీడియా( Social media )లో తన ఆవేదన వ్యక్తం చేసింది.నిజానికి గతంలో పాయల్ పై ఎలాంటి ఆరోపణలు లేవు.మామూలుగానే సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ పరిస్థితి చాలా సున్నితం.ఎవరికి ఇబ్బంది వచ్చిన హీరోయిన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది.అందుకే చాలా వరకు వారు బయటకు రారు.
ఎలా అయినా సరే అని ఇంత పెద్ద సమస్యలో పాయల్ ఇరుక్కొని బయట పడింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే పాయల్ లాంటి చిన్న హీరోయిన్స్ నీ నిర్మాతలు బెదిరిస్తున్నారు.కానీ ప్రమోషన్స్ కి రాని చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు.వారి పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా ? ఉదాహరణకు నయన్ నీ తీసుకుంటే ఆమె ఏ రోజు సినిమా ప్రమోషన్స్ కి రాదు.ఇది అందరికి తెలుసు.అయినా కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ఆమెను బుక్ చేసుకుంటున్నారు.ఇటీవల కాలంలో బాలీవుడ్ ( Bollywood )లో కూడా అడుగు పెట్టింది.మరి పాయల్ కన్నా కూడా నయన్ కి ఉన్న అర్హత ఎక్కువ ఎంటి ? అది కేవలం ఆమెకు చేతిలో ఉన్న సినిమాలు వాటి తాలూకా విజయాలు మాత్రమే కదా.ఇకనైనా టాలీవుడ్ పెద్దలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.