రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం(Vemulawada ) ఎదురుగట్ల గ్రామం లో అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం( PDS rice) 13 క్వింటల్ లు, ఆటో ని పట్టుకొని కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.
వివరాలు ఎదురుగట్ల గ్రామానికి చెందిన పస్తం శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రభుత్వ ప్రజా పంపిణీ బియ్యం ను అక్రమంగా సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు అని ఎస్ ఐ మారుతీ తెలిపారు.