హైదరాబాద్ లోని బొల్లారం ఏరియాలో( Bolarum Area ) ఉన్న కంటోన్మెంట్ ఆస్పత్రి( Cantonment Hospital ) ప్రాంగణంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై చెట్టు కూలింది.
చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై రవీందర్, సరళా దేవి దంపతులు వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలింది.
ఈ ప్రమాదంలో భర్త రవీందర్( Ravindar ) ఘటనాస్థలంలోనే మృత్యువాత పడగా.
సరళా దేవి( Sarala Devi ) తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆస్పత్రికి( Gandhi Hospital ) తరలించారు.
కాగా సరళాదేవి స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.