మేము మాట నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: జులై 17 ఈరోజు నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.చెప్పిన సమయం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

 We Kept Our Word Cm Revanth Reddy, Cm Revanth Reddy, Hyderabad, Farmers Loan Wa-TeluguStop.com

రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారని, అన్నమాట నిలబెట్టుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించా మన్నారు రేవంత్ రెడ్డి.

రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉందన్నారు రేవంత్ రెడ్డి.ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం.

చెప్పిన దాని కంటే ముందే రుణ మాఫీ చేస్తున్నాం.రుణమా ఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు.

రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారు.చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమేనని నిరూపించాం.

60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు.రాహుల్ గాంధీ చెబితే చట్టమే.సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి.దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.వ్యవసాయం దండగ కాదు పండుగ.రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది.

రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో‌ ముడిపడి ఉంది.

రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది.

ఆగస్టు 15 లోపల మరో లక్ష వేస్తాం.విజయ్ మాల్యా, నీరవ్, మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే 2 లక్షల రుణమాఫీ.

రుణమాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేయాలి.

ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం.ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి.

వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.రేపు రైతుబంధు గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube