కంటోన్మెంట్ హాస్పిటల్‎లో దంపతులపై కూలిన చెట్టు.. భర్త మృతి

హైదరాబాద్ లోని బొల్లారం ఏరియాలో( Bolarum Area ) ఉన్న కంటోన్మెంట్ ఆస్పత్రి( Cantonment Hospital ) ప్రాంగణంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై చెట్టు కూలింది.చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై రవీందర్, సరళా దేవి దంపతులు వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలింది.

ఈ ప్రమాదంలో భర్త రవీందర్( Ravindar ) ఘటనాస్థలంలోనే మృత్యువాత పడగా.సరళా దేవి( Sarala Devi ) తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆస్పత్రికి( Gandhi Hospital ) తరలించారు.

కాగా సరళాదేవి స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లైన 16 రోజులకే భర్త నిజస్వరూపం తెలిసింది.. ఎస్త‌ర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు!