పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకునే ఒక పండగ.పుట్టుక, చావు లాంటివి మన చేతిలో ఉండవు కాబట్టి ఇలా మధ్యలో వచ్చే కొన్ని వేడుకలు అయినా చాల ఖర్చు పెట్టి రిచ్ గా చేసుకోవాలని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీస్( Celebrities ) వరకు అందరు కోరుకుంటారు.
కానీ ఆలా ఎంత ఖర్చైనా పెళ్లి చేసుకునే అవకాశం అందరికి దొరక్క పోయిన సినిమా తారలకు మాత్రం డబ్బుకు కొదవేమి ఉంది చెప్పండి.వందల కోట్లు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద మనుషులను పిలిచి ఎంతో ఘనం గా పెళ్లి చేసుకుంటారు.
ఈ మధ్య అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ ( destination wedding )చాల ఫెమస్ అయ్యింది కాబట్టి సొంత విమానాల్లో ఎదో ఒక దూర ప్రాంతాల్లో అతి తక్కువ మంది బందు మిత్రుల మధ్య చేసుకోవడం ఆ వీడియోలను కోట్ల రూపాయలకు మీడియా చానెల్స్ కి అమ్ముకోవడం చూస్తూనే ఉన్నాం.మరి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ముచ్చటగా మూడు నెలలు కూడా కాపురాలు కొనసాగడం లేదు.లైవ్ ఇన్ రిలేషన్ లో, ప్రేమలో ఉన్నన్ని రోజులు నచ్చిన వ్యక్తులు పెళ్లి తో కుటుంబాలు కలిసి చేసుకునే సరికి మాత్రం నచ్చడం లేదు.ఎంత ఖర్చు పెట్టి అయినా పెళ్లి చేసుకుంటున్న ఈ రిచ్ కిడ్స్ ఇంకా ఎంత ఖర్చయినా పర్లేదు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు.
ఇటీవలే మెగా ఫ్యామిలి లో ఈ ప్రకంపనలు బాగా పెరిగాయి.శ్రీజ, నిహారికలు( Sreeja , niharika ) చాల ఘనంగా చిరంజీవి చేతుల మీదుగా కోట్ల రూపాయల ఖర్చు తో పెళ్లి చేసుకున్నారు.తీరా చూస్తే ఎప్పుడు ఎవరు ఎలా విడాకుల ప్రకటన చేస్తారో అని మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.ఒక్క మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.చాల మంది సెలబ్రిటీస్ పరిస్థితి అలాగే ఉంది.మరి పెళ్లి కి ప్రేమకు ఉన్న అవగాహన, అర్ధం చేసుకునే విధానం ఒక్క పెళ్లయ్యాకే ఎందుకు ఉండటం లేదు అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న గా మిగిలిపోతుంది.
ఇలాగె కొనసాగితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం పెట్టిన ఖర్చు కూడా దండగే అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్.కానీ ఈ విడాకుల తంతు సామాన్య ప్రజల విషయంలో కొంత తక్కువే అని చెప్పాలి.