ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు కి వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా

ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలనఇల్లంతకుంట మండలం కేంద్రం లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని గురువారం జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర మంత్రి కేటీఆర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ల దృష్టికి తీసుకెళ్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నీళ్లు,నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చాయని, వేలాది కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇస్తున్నారని, గతంలో ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube