కారులో శవమై తేలిన భారత సంతతి మహిళ .. భర్త కోసం లండన్ పోలీసుల వేట

ఇంగ్లాండ్‌లోని( England ) ఈస్ట్ మిడ్‌లాండ్స్‌ ప్రాంతంలో అదృశ్యమైన భారత సంతతికి చెందిన హర్షిత బ్రెల్లా (24)( Harshita Brella ) కారులోనే శవమై తేలారు.ఈ కేసుకు సంబంధించి భారత సంతతికి చెందిన ఆమె భర్తను నిందితుడిగా అనుమానించిన పోలీసులు గాలిస్తున్నారు.

 Hunt On For Indian-origin Husband Of Woman Found Killed In London Details, Indi-TeluguStop.com

నార్తాంప్టన్‌షైర్ పోలీస్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పాల్ క్యాష్( Chief Inspector Paul Cash ) మాట్లాడుతూ.నిందితుడిని భర్త పంకజ్ లాంబాగా( Pankaj Lamba ) గుర్తించినట్లుగా తెలిపారు.

అతని ఫోటోను మీడియాకు విడుదల చేశామని దాదాపు 60 మందికి పైగా డిటెక్టివ్‌లు ఈ కేసులో పనిచేస్తున్నారని క్యాష్ పేర్కొన్నారు.

హర్షిత మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్‌ నుంచి ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించి ఆపై అతను దేశం విడిచి పారిపోయినట్లుగా తాము అనుమానిస్తున్నామన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తిస్తున్నట్లు క్యాష్ అన్నారు.నార్తాంప్టన్‌షైర్‌లోని( Northamptonshire ) కార్బీలోని స్కెగ్‌నెస్ వాక్‌లోని బ్రెల్లా ఇంటికి పోలీసులు చేరుకుని తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

గురువారం తెల్లవారుజామున తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలోని బ్రిస్బేన్ రోడ్‌లో కారు బూట్‌లో బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

Telugu Paul Cash, Harshita Brella, Indian Origin, London, Pankaj Lamba-Telugu NR

నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు .ఈ విషయమై ప్రజల సహకారం కూడా కోరుతున్నారు.గత కొద్దిరోజులుగా ఘటన జరిగిన ప్రదేశంలో అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపించినట్లయితే దయచేసి పోలీసులను సంప్రదించాలని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనతో భయపడాల్సిన అవసరం లేదని.అయినప్పటికీ రాబోయే రోజుల్లో కార్బీలో పెట్రోలింగ్ మరింత పెంచుతామని తెలిపారు.

Telugu Paul Cash, Harshita Brella, Indian Origin, London, Pankaj Lamba-Telugu NR

లండన్‌కు ఉత్తరాన 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బీలోని తన నివాసం నుంచి బ్రెల్లా తప్పిపోవడంతో పాటు కారులో శవమై తేలడానికి ముందు ఏం జరిగిందన్న దానిని పోలీసులు కూపీ లాగుతున్నారు.బాధితురాలికి, పోలీస్ బలగాలకు మధ్య గతంలో ఉన్న పరిచయాల కారణంగా నార్తాంప్టన్‌షైర్ పోలీసులు.ఈ కేసును ఇండిపెండెంట్ ఆఫీస్ ఫర్ పోలీస్ కండక్ట్ (ఐవోపీసీ)కి సిఫారసు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube