ప్రస్తుత సమాజంలో ఆల్కహాల్( Alcohol ) ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది.అలాగే ప్రభుత్వాలకు కూడా ఎక్సేంజ్ శాఖ ఆదాయ వనరుగా మారిపోయింది.
దీని వల్ల చాలామంది ప్రజలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.కొంతమంది ప్రజలు ఆల్కహాల్ సేవించి వాంతులు కూడా చేసుకుంటూ ఉంటారు.
దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి.కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ఈ కారణాలు కూడా మారుతూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఆల్కహాల్ తీవ్రతను తట్టుకునే శక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది.కొంతమంది ఆల్కహాల్ తక్కువగా తీసుకున్న కూడా వాంతులు చేసుకుంటూ ఉంటారు.
వీరిలో ఆల్కహాల్ తీవ్రతను తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
అలాగే వీరిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు( Health Problems ) కూడా ఉండవచ్చు.ఆల్కహాల్ సేవించేటప్పుడు ఎలా పడితే అలా తీసుకున్న వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఇలా చేసినప్పుడు కూడా వాంతులు( Vomiting ) ఎక్కువగా అవుతూ ఉంటే అది వేరే అనారోగ్య సమస్యల వల్ల కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మూత్రం( Urine ) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దీని వల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది.ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి డిహైడ్రేషన్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది పాయిజన్ గా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఇలాంటి సమయంలో ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే చాలా రకాల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి సమయంలో కూడా ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు.అలాగే ఆల్కహాల్ సేవించిన వెంటనే ప్రయాణాలు( Travelling ) అసలు చేయకూడదు.అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల ఇది జీర్ణాశయాన్ని దెబ్బ తీస్తుంది.దీని వల్ల కూడా వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.