విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు( NRI’s ) దేశానికి విదేశీ మారక ద్రవ్యంతో పాటు జన్మభూమిలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇక మాతృదేశంలో పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐలను ఆకర్షిస్తున్నారు.ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 24 , 25 తేదీలలో భోపాల్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో( Global Investors Summit ) రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనుంది.
ఈ సెషన్‌లో పెట్టుబడులు, వృద్ధి అవకాశాలపై చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రవాసీ మధ్యప్రదేశ్ సమ్మిట్( Pravasi Madhya Pradesh summit ) రెండు రోజుల పాటు షెడ్యూల్ చేయబడింది.300 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రతినిధులు, దేశ భాగస్వాములు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్‌లో పాల్గొననుండగా.
ప్రధాని నరేంద్రమోడీ( PM Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది.వివిధ విభాగాలకు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలను ఆహ్వానించే పనిని అప్పగించారు.
ప్రస్తుతం అతిథుల జాబితాను సిద్ధం చేస్తున్నారని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి తెలిపారు.ఈ సమ్మిట్‌లో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ), టెక్స్‌టైల్స్, దుస్తులు, ఫార్మాస్యూటికల్స్, కుటీర పరిశ్రమలపై సెషన్‌లు ఉంటాయి.మౌలిక సదుపాయాలు, పట్టాణాభివృద్ధి, పర్యాటకం, గనులు, ఇంధనం, కృత్రిమ మేధస్సు, ఇతర భవిష్యత్ సాంకేతికత వంటి రంగాలపై నిర్మాణాత్మక సెషన్‌లను నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
శిఖరాగ్ర సదస్సు తొలిరోజున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి , ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్, అతిథులు ఇతర కార్యక్రమాలపై మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.