జూనియర్ ఎన్టీఆర్ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. జక్కన్న కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వం వహించిన చివరి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌.( RRR ) ఇందులో రామ్ చరణ్( Ram Charan ) జూనియర్ ఎన్టీఆర్ లు( Jr NTR ) హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.

 Director Rajamouli React On Rrr Behind And Beyond Details, Rajamouli, Tollywood,-TeluguStop.com

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో పాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ ఎంతలా కష్టపడ్డారు అన్న విషయాన్ని తాజాగా దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్ అండ్ బియాండ్( RRR: Behind and Beyond ) పేరుతో ఒక డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ పై రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌, నిర్మాత డీవీవీ దానయ్య కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Telugu Ntr, Ntr Rrr Tiger, Rajamouli, Rajamouli Rrr, Ram Charan, Ramcharan, Rr,

మరి ఆ వివరాల్లోకి వెళితే.జక్కన్న ఈ విషయంపై స్పందిస్తూ.కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు దాదాపు ఒకే సమయంలో పుట్టారు.ఒకే సమయంలో ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారు.వారిద్దరూ ఒకచోట తారసపడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఆర్‌ఆర్‌ఆర్‌ కథ.బుక్స్‌, కామిక్స్‌, మూవీస్‌ ఇలా ఏదైనా అందులో యాక్షన్‌ ఉంటే ఇష్టపడతాను.అందులో సాధ్యమైనంతవరకూ ఎమోషన్‌ ను జోడించాలనుకుంటాను హీరోల ఇంట్రడక్షన్స్‌ సీన్స్‌ ను యాక్షన్‌ ఓరియెంటెడ్‌ గానే కాకుండా ఆయా పాత్రల గురించి ప్రేక్షకుడికి లోతుగా తెలియాలనుకుంటాను.అలా చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌.

సినిమాలో మరింత స్కోప్‌ దక్కింది అని రాజమౌళి తెలిపారు.రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ విషయంలో ఆలోచించినంతగా మరే చిత్రానికి ఆలోచించలేదు.

ఆ సీన్‌ లో లుక్స్‌ పరంగా ఆ క్యారెక్టర్‌ హీరోగా కనిపించినా యాక్షన్‌ పరంగా విలన్‌ గా కనిపిస్తుంది.

Telugu Ntr, Ntr Rrr Tiger, Rajamouli, Rajamouli Rrr, Ram Charan, Ramcharan, Rr,

ఫైట్‌ ఎలా ఉండాలో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కు వివరించాను.నా విజన్‌ ఏంటో సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కూ చెప్పాను అని తెలిపారు.ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ.

టైగర్‌ సీక్వెన్స్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని.భీమ్‌ పాత్రతో అది కుదిరింది.

తారక్‌ ఎంతో వేగంగా పరిగెత్తాడు.ఒక చోట జంప్‌ చేసే క్రమంలో నేను ఊహించిన షాట్‌ దొరికిందనిపించింది.

జంతువుల వేగాన్ని అందుకోవడం కష్టం.దానికి తగ్గట్టు తొలుత యానిమేషన్‌ చేశాము.

యానిమల్‌ ఉందని ఊహించుకొని ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేయడం ఒకెత్తు అయితే, ఎంత వేగంతో పరిగెత్తాలన్నది మరో ఎత్తు.భీమ్‌ క్యారెక్టర్‌ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ అయినా ఎమోషన్‌ ఎక్కువ.

భీమ్‌ టైగర్‌ ఫేస్‌ టు ఫేస్‌ షాట్‌ ఐకానిక్‌.ఎన్టీఆర్‌ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఒక్క పులి కాదు రెండు పులులతో షూటింగ్‌ చేశాను అని చెప్పుకొచ్చారు జక్కన్న.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube