టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు( Prabhas ) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ సినిమాల ఎంపిక బాగుండగా వేగంగా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ తర్వాత సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలతో పాటు ప్రభాస్ ఖాతాలో స్పిరిట్,( Spirit ) మరికొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి.
ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అయితే టాలీవుడ్ హీరోలైన చరణ్,( Charan ) తారక్( Tarak ) కూడా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సినిమాల విషయంలో ఈ హీరోలు ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు.
చరణ్, తారక్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించే విధంగా ఈ హీరోల ప్లానింగ్ ఉంది.ఐదు నెలల గ్యాప్ లో వార్2,( War 2 ) ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలు విడుదల కానున్నాయి.ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రామ్ చరణ్ కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.
రామ్ చరణ్ 2025 సంవత్సరంలో గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో పాటు బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో సినిమాతో బిజీగా ఉన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చరణ్, తారక్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.రామ్ చరణ్, తారక్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.