సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన అభిమానులను సైతం ఎంతో బాధ పెట్టింది.
తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు ఇప్పటికే ఈ ఘటన గురించి స్పందించడం జరిగింది.అయితే ఈ ఘటన గురించి ఏపీకి చెందిన నేతలు మాత్రం స్పందించలేదు.
అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ఈ ఘటనకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
పవన్ మాట్లాడుతూ బన్నీ అరెస్ట్( Bunny Arrest ) గురించి విభిన్నంగా రియాక్ట్ అయ్యారు.
ఈ ప్రశ్న సంబంధం లేని ప్రశ్న అని మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతామని అన్నారు.ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని సినిమాలను మించిన సమస్యలపై డిబేట్ పెట్టి అడగాలని పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
బన్నీ అరెస్ట్ గురించి పవన్ ఈ విధంగా స్పందించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వివాదం విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం ఉన్న నేపథ్యంలో పవన్ ఈ వివాదం గురించి స్పందించడానికి ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఓజీ,( OG ) హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని సత్తా చాటాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.