షెఫీల్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ( Engineering at the University of Sheffield )చేయాలనుకుంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్! 2025 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జాయిన్ అయ్యేవాళ్లకి షెఫీల్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అదిరిపోయే స్కాలర్‌షిప్స్ ఇస్తోంది.ఈ స్కాలర్‌షిప్స్ విద్యార్థుల టాలెంట్ ని గుర్తించి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి డిజైన్ చేశారు.మాగ్జిమమ్ గా 3,000 పౌండ్ల (సుమారు రూ.3,22,200) వరకు స్కాలర్‌షిప్ గెలుచుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్ సాధించాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి.మొదటగా 2025 అడ్మిషన్స్ కోసం UCAS ద్వారా అప్లై చేసేటప్పుడు షెఫీల్డ్ యూనివర్సిటీని మీ ఫస్ట్ ఛాయిస్ గా పెట్టాలి.
(UCAS అంటే UKలోని యూనివర్సిటీలకు అప్లై చేయడానికి ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్).అలాగే ట్యూషన్ ఫీజుల కోసం “ఓవర్సీస్ స్టూడెంట్”( Overseas Student ) గా కన్సిడర్ చేయబడాలి.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి, అంతేకాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న డిగ్రీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్ రిక్వైర్‌మెంట్‌ని ఫుల్ ఫిల్ చేయాలి.
టాలెంటెడ్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్ కి డైరెక్ట్ గా ఎలిజిబుల్ అవుతారు.ఉదాహరణకు UCAS ఆఫర్స్‌లో మెన్షన్ ( Mention in UCAS offers )చేసిన అకాడెమిక్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవ్వడం లేదా క్రాస్ చేయడం.మీ కంట్రీలో A-లెవెల్ గ్రేడ్స్ A*AA లేదా సిమిలర్ క్వాలిఫికేషన్స్ సాధించడం.
ఈ స్కాలర్‌షిప్ కోర్సు స్టార్టింగ్ లో క్యాష్ రూపంలో ఇస్తారు.ఒక వెయ్యి పౌండ్ల నుంచి 3000 పౌండ్ల వరకు స్కాలర్‌షిప్ అమౌంట్ గెలుచుకోవచ్చు.
అయితే ఎంత స్కాలర్‌షిప్ లభిస్తుందనేది వారి స్టూడెంట్ల అకాడెమిక్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.అంతే కాదు, చదువుతున్న టైంలో 70% యావరేజ్ మార్క్స్ మెయింటైన్ చేస్తే, ప్రతి ఇయర్ అదనంగా 1,000 పౌండ్లు విద్యార్థుల అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.
ఈ స్కాలర్‌షిప్ కోసం సెపరేట్ గా అప్లై చేయాల్సిన అవసరం లేదు.ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్లని ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కన్సిడర్ చేస్తారు.సో, ఇంకెందుకు లేట్? UKలోని టాప్ యూనివర్సిటీస్‌లో ఇంజనీరింగ్ చేయాలనుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్.ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీ డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకోండి.