సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్( NTR ) ను నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టిన సంగతి మనకు తెలిసిందే.హరికృష్ణ మరణించిన తర్వాత ఎన్టీఆర్ తో పాటు అతను అన్నయ్య కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ను కూడా నందమూరి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
ముఖ్యంగా బాలకృష్ణ( Balakrishna ) వీరిద్దరిని గత కొద్ది రోజులుగా దూరం పెడుతూనే వస్తున్నారు.ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా కొన్ని విషయాలలో మౌనం పాటిస్తూ ఉండడాన్ని మరికొంతమంది నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు( Chandra Babu Naidu ) గతంలో అరెస్ట్ అయిన సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు.అలాగే నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఖండించారు కానీ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏ మాత్రం స్పందించలేదు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ కూడా వేయలేదు.ఇక చంద్రబాబు నాయుడు ఏపీలో సీఎం అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పగా చంద్రబాబునాయుడు తిరిగి రిప్లై కూడా ఇచ్చారు.
దేవర సినిమా విడుదల కాగా సినిమా టికెట్లు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది.అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు( Rammurthy Naidu ) మరణించారు.ఆయన మరణం పట్ల సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ నివాళులు అర్పించారు.
కానీ రామ్మూర్తి నాయుడు విషయంలో ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఎక్కడా కూడా స్పందించలేదు.వీరు సినిమా సెలబ్రిటీలు అయినప్పటికీ మరోవైపు రామ్మూర్తి నాయుడు వారికి స్వయంగా మామ వరస అవుతారు.
ఇలా తమ బంధువు మరణిస్తే సోషల్ మీడియాలో కనీసం నివాళులు అర్పిస్తూ పోస్ట్ కూడా చేయకపోవడం పట్ల పలువురు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఎందుకు స్పందించలేదనే కారణాలు వారికే తెలియాల్సి ఉంది.