సినీనటి కస్తూరి శంకర్( kasturi Shankar ) ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈమె తెలుగు వారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకొని 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి ఈమె అనుచిత వ్యాఖ్యలు చేశారు 300 సంవత్సరాల క్రితం తమిళ రాజు భార్యకు సేవలు చేయడానికి తెలుగు వారు ఇక్కడికి వచ్చారని, ఇక్కడే స్థిరపడి వాళ్లే తమిళ ప్రజలుగా చెప్పుకుంటున్నారు అంటూ ఈమె తెలుగు వారి గురించి మాట్లాడటంతో తెలుగు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.ఈ క్రమంలోనే తనపై చర్యలు తీసుకోవాలి అంటూ కేసులు కూడా నమోదు చేశారు.
ఇలా తెలుగు సంఘాల గురించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈమెపై పోలీసుల కేసు నమోదు చేసుకొని తనకోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే చెన్నైలో కస్తూరి శంకర్ నివసిస్తున్న ఇంటికి తాళం వేసి ఉండటమే కాకుండా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఈమె పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.అయితే ఈమె హైదరాబాద్లో రాజేంద్రనగర్ లో ఉన్నారనే విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు ఆమెను హైదరాబాద్ లో( Hyderabad ) అరెస్టు చేసి చెన్నై తరలించారు.ఇక కోర్టు ఈమెకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.ప్రస్తుతం కస్తూరి శంకర్ ను పుళల్ జైలుకు తరలించారు.
ఈమె అరెస్టు కావడానికి ముందు ఒక వీడియోని విడుదల చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె పలు విషయాలను తెలియచేశారు.హైదరాబాద్‌లో సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో ఉన్న ఆమెను ప్రత్యేక బృందం అరెస్టు చేశారు.అరెస్టుకు ముందు ఈ వీడియోని చేశారు.నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఏమాత్రం భయపడటం లేదు తాను చెన్నైలో లేను అంటే హైదరాబాదులో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని తెలిపారు.ప్రతిరోజు షూటింగ్ పూర్తి చేసుకుని నేను చెన్నై( Chennai ) వెళ్ళిపోతున్నానని ఈమె తెలిపారు.
ఇక నా ఫోన్ లాయర్ వద్ద ఉండిపోయిందని ఈ విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను అంటూ కస్తూరి శంకర్ ఈ వీడియో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.