ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌.. ఇది ముంబై సిటీ కంటే పెద్దది..

సౌదీ అరేబియాలోని( Saudi Arabia ) దమ్మామ్ నగరంలో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం( King Fahd International Airport ) ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం మీకు అని తెలుసా? అవును, ఈ విమానాశ్రయం మన దేశంలోని ముంబై నగరం( Mumbai ) అంత పెద్దదిగా ఉంటుంది.ఇది దాదాపు 780 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.

 Bigger Than Mumbai Inside Worlds Largest Airport King Fahd International Airport-TeluguStop.com

ఈ విమానాశ్రయం 1999 నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.ప్రతి ఏడాది దాదాపు 2 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం గుండా ప్రయాణిస్తారు.

అంతేకాకుండా, ఏటా 1,25,000 టన్నుల వస్తువులను ఈ విమానాశ్రయం నిర్వహిస్తుంది.ఇక్కడ 4,000 మీటర్ల పొడవున్న రెండు పెద్ద రన్‌వేలు ఉన్నాయి.ఈ రన్‌వేలపై ఎయిర్‌బస్ A340-600, బోయింగ్ 747-400 వంటి భారీ విమానాలు కూడా సులభంగా తిరగగలవు.ఈ విమానాశ్రయంలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.

కింగ్ ఫహద్ విమానాశ్రయంలో ఒక పెద్ద మసీదు ఉంది, ఇక్కడ 2000 మంది వరకు ప్రార్థించవచ్చు.అంతేకాదు, ఈ విమానాశ్రయం నుంచి బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే విమానాలు బయలుదేరుతాయి.కేవలం 76 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.అలాగే, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజుకు సగటున తొమ్మిది విమానాలు బయలుదేరుతాయి.ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్, ఫ్లైనాస్ వంటి ఎయిర్‌లైన్స్ ఈ రూట్‌లో సర్వీసులు అందిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంత పెద్దదో చూపించే ఒక వీడియో కూడా వైరల్ అయింది.ముంబై నగరంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను పోల్చిన వీడియో 8.6 మిలియన్ల మందిని ఆకట్టుకుంది.ఈ విమానాశ్రయం సౌదీ అరేబియా విమానయాన రంగంలో ఎంతగా అభివృద్ధి చెందిందో చూపిస్తోంది.అంతర్జాతీయ వ్యాపారం, ప్రయాణాలను ప్రోత్సహించడంలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తోంది.ఏది ఏమైనా ఒక పెద్ద సిటీ అంత విస్తీర్ణంలో ఒక విమానాశ్రయం ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube