భారతదేశంలో వివాహాలు( Weddings ) అంటే ఓ గొప్ప జాతరే.ఈ జాతరలో వరుడు గుర్రాల రథం ఎక్కి వధువును కలవడం ఆనవాయితీగా వస్తోంది ఈ ప్రత్యేక ఆచారాన్ని పెళ్లి బరాత్( Barat ) అంటారు.
అయితే, రాజస్థాన్‌లోని( Rajasthan ) చురు నగరంలో జరిగిన ఈ వివాహ ఆచారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.గుర్రపు బండి పై వరుడు రావాలని కదా ఇక్కడ మాత్రం వధువు( Bride ) వచ్చింది అది కూడా ఆమె ఒక రాణి లాగా సింగిల్ గుర్రంపై విచ్చేసింది.
ఆ వధువు పేరు మోనికా సైని.ఈ అందమైన పెళ్లికూతురు రథం ఎక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాజస్థాన్‌లో వరుడు గుర్రాన్ని ఎక్కడాన్ని బిందోరి అంటారు.కానీ ఈసారి వధువు కుటుంబం ఈ ఆచారాన్ని మార్చి ఆమే గుర్రం( Horse ) ఎక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

చురు నగరంలోని 6వ వార్డులో నివసిస్తున్న మోనికా సైని( Monica Saini ) తండ్రి మనోజ్ కుమార్ సైని ఈ విధంగా చేయడం వెనక గల కారణాన్ని వివరించారు.కుమార్తెలను, కొడుకులను సమానంగా చూడాలనే సందేశాన్ని ఈ విధంగా ఇవ్వాలనుకున్నారని తెలిపారు.మోనికాకు నలుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు.వారిలో మోనికా రెండవది.ఈ కుటుంబం కలిసి ఈ ఆలోచనను చర్చించి, లింగ వివక్షను తొలగించడానికి ఈ ఆచారాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు.

నవంబర్ 16న రత్నగఢ్‌కు చెందిన హెమంత్ సైనిని వివాహం చేసుకున్న మోనికా బిందోరి వేడుకలో గుర్రం ఎక్కేలా అందరూ నిర్ణయించుకున్నారు.మోనికా సైని వివాహంలో జరిగిన ఈ ఆచారం స్థానిక ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఆ వధువు గుర్రంపై ఊరేగింపుకు వెళ్లినప్పుడు స్థానికులు, వివాహ అతిథులు ఉత్సాహంగా స్వాగతం పలికారు.
ఆమె ఫోటోలు వీడియోలు కూడా తీశారు.అయితే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







