బాబు మార్క్ రాజకీయం అంటే ఇదే ! జగన్ కు అర్థమయ్యిందా  ? 

చంద్రబాబు( Chandrababu ) మార్క్ రాజకీయాలు అంటే ఏమిటి ? ఎలా ఉంటాయో వైసిపి అధినేత జగన్ కు( YS Jagan ) బాగా తెలిసి వచ్చినట్టు కనిపిస్తుంది.రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండడం, ప్రత్యర్థులను ఇరుకుని పెట్టేలా  అనుసరించే వ్యూహాలు ఆషామాషీగా ఎవరికి అర్థం కావు.

 Chandrababu Naidu Tdp Mlas To Play Opposition Role In Assembly Details, Ysrcp, A-TeluguStop.com

తమపై పై చేయి సాధించే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా, వ్యూహాలు పన్నడం లో చంద్రబాబు దిట్ట.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) జరుగుతున్నాయి.

ఈ సమావేశాలకు వైసిపి దూరంగా ఉంది.సభకు వచ్చినా, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆరోపిస్తూ వైసిపి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది.

తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ పట్టుబడుతున్నారు.ఈ విధంగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని వ్యూహంతో జగన్ ఉండగా, ఈ విషయం వైసిపికి ఎక్కడా అవకాశం దొరకకుండా చంద్రబాబు వ్యూహం రచించారు.

Telugu Ap Assembly, Ap, Chandrababu, Tdp Mlas, Ys Jagan, Ysrcp-Politics

దీనిలో భాగంగానే వైసిపి సభకు రాకపోవడంతో,  స్వపక్ష ఎమ్మెల్యేలతోనే ప్రజల తరఫున గళం వినిపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం మనమే సమాధానం చెబుదామంటూ అసెంబ్లీ సెషన్ తీరుని చంద్రబాబు మార్చేశారు.దీంతో వైసిపి డైలమాలో పడింది .స్వపక్ష ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు ప్రతిపక్ష రోల్ పోషించేలా చేయడం వెనుక వైసీపీని దెబ్బ కొట్టి ప్లాన్ గానే కనిపిస్తోంది .మీడియా ద్వారానే కూటమి ప్రభుత్వ బడ్జెట్ విధానాలపై ప్రశ్నిస్తామంటూ వైసీపీ సభ్యులు సభకు హాజరవ్వడం లేదు.దీంతో వైసీపీని దెబ్బ కొట్టేలా తమ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ద్వారా ప్రతిపక్షపాత్ర పోషించే వ్యూహాన్ని రచించారు.

Telugu Ap Assembly, Ap, Chandrababu, Tdp Mlas, Ys Jagan, Ysrcp-Politics

ప్రశ్నలు మనమే వేద్దాం సమాధానాలు మనమే చెబుదాం,  ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా చూపెడదాం అంటూ కొత్త రాజకీయానికి చంద్రబాబు తెర తీశారు.క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు,  సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.ప్రజా సంక్షేమం కోసం తాము ఏం చేయాలనుకుంటున్నామో చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా అన్నిటి పైన క్లారిటీ ఇస్తూనే ప్రతిపక్ష రోల్ ను పోషిస్తూ ప్రజలకు ఈ విషయాలు అర్థమయ్యేలా చంద్రబాబు ప్లాన్ చేశారు.ఈ మేరకు కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు( TDP MLA’s ) సభలో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు .వైసిపి సభ్యులు సభలో ఉంటే ఎలా ప్రశ్నిస్తారో అలాగే సమస్యలను లేవనెత్తుతున్నారు.ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు.

గత రెండు రోజులుగా సభలో ఈ తరహా మార్పు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube