ఇటీవల జైపూర్‌లోని( Jaipur ) ప్రముఖ భేరూజీ దేవాలయ ప్రాంగణంలోకి ఒక చిరుత( Leopard ) ప్రవేశించింది.తెల్లవారు జామున ఇది ఆహారం కోసం అటు వైపుగా సైలెంట్ గా నడుస్తూ వచ్చింది.
అయితే, ఆ దేవాలయంలో ఉన్న పిట్‌బుల్( Pit Bull ) కుక్క ఆ చిరుతను చూసి పారిపోలేదు.అది వెనుకాడకుండా ధైర్యంగా చిరుత పులితో తలపడింది.
ఈ ఫియర్‌లెస్ డాగ్ చిరుతను తరిమికొట్టి, ఆ దేవాలయంలో ఉన్న భక్తులను రక్షించింది.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు ఆ కుక్కను ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు.

ఆకలితో ఉన్న చిరుత, సులభమైన ఆహారంగా భావించి ఆ పిట్‌బుల్‌పై దాడి చేసింది.అయితే, ఆ పిట్‌బుల్ తనను తాను రక్షించుకోవడానికి వెనుకాడకుండా ధైర్యంగా పోరాడింది.ఆ కుక్క చూపించిన బలం, ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైరల్ అవుతున్న వీడియోలో,( Viral Video ) ఆ పిట్‌బుల్ చిరుతను నేలపై పడుకోబెట్టి బాగా కరిచేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కేవలం 10 సెకన్లలోనే ఆ పోరాటంలో చేతులెత్తేసింది చిరుత.అంతేకాదు, బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది.

చిరుతతో జరిగిన ఈ తీవ్ర పోరాటంలో కొన్ని గాయాలైనా పిట్‌బుల్ తన ధైర్యాన్ని కోల్పోలేదు.దేవాలయ ప్రాంగణాన్ని ధైర్యంగా కాపాడిన ఆ కుక్క తన లాయల్ ఫ్రెండ్ గా నిరూపించుకుంది.దాని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.చాలా మంది నెటిజన్లు ఆ పిట్‌బుల్‌ను ప్రశంసిస్తున్నారు.“ఈ పిట్‌బుల్ చూపించిన ధైర్యం అద్భుతం.చిరుతను నేలపై పడేసి అటాక్ చేయడం చిన్న విషయం కాదు!” అని ఒకరు కామెంట్ చేశారు.పిట్‌బుల్ కుక్కలకు భయం అంటే ఏంటో తెలియదు.అవి నాలుగు కలిసి ఉంటే చాలు ఎంత పెద్ద సింహానైనా లేదంటే పులినైనా ఎదిరించగలవు.







