ప్రతి ఏడాది ఎందరో మంది క్యాన్సర్ మహమ్మారితో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా మన దేశంలో గుండెజబ్బుల తర్వాత ఎక్కువ శాతం మంది క్యాన్సర్ వల్లనే మృతి చెందుతున్నారు.
క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.అలాగే క్యాన్సర్‌లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి.
బ్రెస్ట్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.శరీరం లో ఏర్పడే అసాధారణమైన కణాల వల్లే క్యాన్సర్ బారిన పడుతుంటారు.
అందుకే క్యాన్సర్ వచ్చాక బాధ పడడం కన్నా.రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే కాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ క్యాన్సర్‌ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.కాప్సికమ్‌లో కేప్ససియన్స్ ఉంటుంది.ఇది రక్త కణాలతో కలిసిపోయి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకట్ట వేస్తుంది.కాప్సికమ్‌తో క్యాన్సర్‌నే కాదు.
మరిన్ని ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
శరీర రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కాప్సికమ్ లో పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, కాప్సికమ్‌ను కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి.అలాగే హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడేవారికి కాప్సికమ్ బెస్ట్ ఆప్షన్.
కాప్సికమ్‌ను తీసుకోవడం వల్ల.అందులో ఉండే ఖనిజ, లవణాలు జుట్టు రాలిపోకుండా చేయడంతో పాటు ఒత్తుగా, దృఢంగా ఎదిగేలా చేస్తుంది.
మరియు కాప్సికమ్‌లో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కాప్సికమ్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కాప్సికమ్‌ను అతిగా మాత్రం తీసుకోరాదు.ఎందుకంటే, కాప్సికమ్‌ను అతిగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, లిమిట్‌గా మాత్రమే కాప్సికమ్‌ను తీసుకోవాలి.