నా కొడుకుతో తిరగద్దు అంటు మంచు మోహన్ బాబు వార్నింగ్ ఎవరికి ఇచ్చారో తెలుసా ?

తమ పిల్లలు చెడు అలవాట్లతో సమయాన్ని వృధా చేసుకుంటుంటే ఏ తల్లిదండ్రుల కైనా కోపం వస్తుంది.బాధ్యత లేకుండా కెరియర్ పై లక్ష్యం లేకుండా చెడు వ్యసనాల బారిన పడితే మందలించకుండా ఉండగలమా ? అలాంటి ఒక సంఘటనే మోహన్ బాబు తన కుమారుడు విషయంలో చేశాడు.రోజులకు రోజులు బయట స్నేహితులతో సమయం గడుపుతూ, పార్టీలు, పబ్బులు తిరుగుతూ ఇంటికి కూడా సమయానికి రాకుండా జల్సాల బారిన పడ్డ మంచు మనోజ్ ని మోహన్ బాబు ఏ విధంగా మందలించాడు ? బయట ప్రపంచానికి తెలియని ఆ సంఘటన పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం.

 Manchu Mohan Babu Mass Warning To Serial Hero , Manchu Mohan Babu , Warning To-TeluguStop.com

క్రమశిక్షణకు మోహన్ బాబు మారుపేరు ఆయన ముందు ఎవరైనా తప్పు చేయడానికి ఎవ్వరైనా భయపడతారు అసలు ఎలాంటి పొరపాట్లు దొల్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

  ఆయన సెట్ కి వచ్చారంటే చాలు అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది.అంతటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు తన సొంత కొడుకు విషయంలో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశారంటే నమ్మశక్యం కాని విషయమే.

కానీ జరిగింది, అది కూడా మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ విషయంలో.అయితే ఈ విషయం బయట పెట్టింది మరెవరో కాదు అత్తారింటికి దారేది వంటి సీరియల్ తో బుల్లితెర మన్మధుడుగా పేరు తెచ్చుకున్న సీరియల్ హీరో వీరేన్.

మంచు మనోజ్ వీరే ఇద్దరు ప్రాణ స్నేహితులు.దాదాపు ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ఒక 10 యేళ్లు దాటే ఉంటుంది.

Telugu Mohan Babu, Full, Manchu Manoj, Viren, Serial-Telugu Stop Exclusive Top S

ఆ సమయంలో మంచు మనోజ్, వీరెన్ సహా మరి కొంతమంది స్నేహితులతో కలిసి ఎప్పుడు ఫుల్ పార్టీ కల్చర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు.కేవలం ఇక్కడ స్నేహితులు మాత్రమే కాకుండా వీరి కోసం చెన్నై నుంచి పదుల సంఖ్యలో స్నేహితులు వచ్చేవారు.అలా వీరంతా కలిసి రోజులపాటు ఇంటికి వెళ్లకుండా బయట తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ టైం గడిపేవారు.ఓసారి ఈ విషయం మోహన్ బాబు దృష్టికి రాగా ఈ బ్యాచ్ లో గ్యాంగ్ లీడర్ ఎవరు అని ఆరా తీశారట దాంతో వీరేన్ అని తెలియడంతో సరాసరి కి ఫోన్ కలిపి, తన కొడుకుతో మళ్ళీ ఇంకోసారి కలిసి కనిపిస్తే కాళ్ళు విరగ్గొడత అంటు వార్నింగ్ ఇచ్చాడట.

అప్పటినుంచి వీరంతా కలిసి తిరగడం మానేసారట.ప్రస్తుతం ఈ విషయం గురించి వీరేన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అధి కాస్త వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube