ఇటీవల కాలంలో వధూవరులు పెళ్లి మండపాలలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ షాకిస్తున్నారు.ప్రాంక్స్( Pranks ) అంటూ వీరు ఈ పనులు చేస్తున్నారు.
అయితే ఈ ప్రాంక్స్ ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి.తాజాగా అదే జరిగింది.
ఒక వరుడు కేక్ ప్రాంక్( Cake Prank ) చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ అయ్యింది.అతని వివాహ వేడుకలో( Wedding ) జరిగిన ఆ ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.@mgzn99 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను 3.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.ఈ క్లిప్‌లోని జంటపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్‌ల వర్షం కురిసింది.
వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కేక్ కట్ చేయడం కనిపిస్తుంది.వరుడు వధువును అల్లరి చేస్తూ కేక్ ముక్కను తీసుకుని, వధువు నోటి దగ్గర పెట్టాడు.ఆమె తినాలని ప్రయత్నించినా ప్రతిసారి వెనక్కి తీసుకుంటూ ఆడుకుంటాడు.
ప్రేక్షకులు నవ్వుతూ ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు.వధువు కూడా నవ్వుతూ వరుడి అల్లరిని సరదాగా తీసుకుంటుంది.
తర్వాత ఆమె కూడా ఇలాంటి ప్రాంక్ చేస్తుంది.వధువు వరుడిని ఆటపట్టిస్తుంది.
నోటి దగ్గర పెట్టినట్టే పెట్టి అతడి నోట్లో కేకు ముక్కను కుక్కుతుంది.దాంతో వరుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు.
కోపంతో ఉన్న వరుడు ఆమెను కొట్టడానికి ప్రయత్నించాడు.ఈ దృశ్యాన్ని చూసిన అతిథులు వెంటనే అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అయినప్పటికీ, వరుడు వారిని పక్కకు నెట్టివేసి ఒకరిని నేలపై పడవేశాడు.
చాలామంది వరుడి ప్రవర్తనను తప్పుబట్టారు.“ఇప్పుడే పెళ్లి అయింది, అప్పుడే భార్యను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇలాంటి వ్యక్తితో ఎలా జీవించాలి?” అని ఒకరు కామెంట్ చేశారు.“నా కూతురుని ఇలాంటి వ్యక్తికి ఇచ్చి ఉంటే నేను వదలను” అని మరొకరు అన్నారు.మరికొందరు ఈ ఘటనపై హాస్యంగా స్పందించారు.“జోక్ చేయడం వస్తే, జోక్‌ను తట్టుకోవడం కూడా రావాలి” అని ఒకరు కామెంట్ చేశారు.“ఈ వ్యక్తికి పెళ్లి కాకూడదు.నేను వధువు తండ్రి అయితే, ఆయన్ని ఆస్పత్రి పాల చేసేవాడిని” అని మరొకరు అన్నారు.ఈ వీడియో చూసిన చాలామంది వరుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.