వీడియో: కేక్ ప్రాంక్ చేసిన వరుడు.. ఎలా బెడిసి కొట్టిందో చూడండి..
TeluguStop.com
ఇటీవల కాలంలో వధూవరులు పెళ్లి మండపాలలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ షాకిస్తున్నారు.
ప్రాంక్స్( Pranks ) అంటూ వీరు ఈ పనులు చేస్తున్నారు.అయితే ఈ ప్రాంక్స్ ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి.
తాజాగా అదే జరిగింది.ఒక వరుడు కేక్ ప్రాంక్( Cake Prank ) చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ అయ్యింది.
అతని వివాహ వేడుకలో( Wedding ) జరిగిన ఆ ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
@mgzn99 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను 3.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
ఈ క్లిప్‌లోని జంటపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిసింది. """/" /
వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కేక్ కట్ చేయడం కనిపిస్తుంది.
వరుడు వధువును అల్లరి చేస్తూ కేక్ ముక్కను తీసుకుని, వధువు నోటి దగ్గర పెట్టాడు.
ఆమె తినాలని ప్రయత్నించినా ప్రతిసారి వెనక్కి తీసుకుంటూ ఆడుకుంటాడు.ప్రేక్షకులు నవ్వుతూ ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
వధువు కూడా నవ్వుతూ వరుడి అల్లరిని సరదాగా తీసుకుంటుంది.తర్వాత ఆమె కూడా ఇలాంటి ప్రాంక్ చేస్తుంది.
వధువు వరుడిని ఆటపట్టిస్తుంది.నోటి దగ్గర పెట్టినట్టే పెట్టి అతడి నోట్లో కేకు ముక్కను కుక్కుతుంది.
దాంతో వరుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు.కోపంతో ఉన్న వరుడు ఆమెను కొట్టడానికి ప్రయత్నించాడు.
ఈ దృశ్యాన్ని చూసిన అతిథులు వెంటనే అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.అయినప్పటికీ, వరుడు వారిని పక్కకు నెట్టివేసి ఒకరిని నేలపై పడవేశాడు.
"""/" /
చాలామంది వరుడి ప్రవర్తనను తప్పుబట్టారు."ఇప్పుడే పెళ్లి అయింది, అప్పుడే భార్యను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇలాంటి వ్యక్తితో ఎలా జీవించాలి?" అని ఒకరు కామెంట్ చేశారు."నా కూతురుని ఇలాంటి వ్యక్తికి ఇచ్చి ఉంటే నేను వదలను" అని మరొకరు అన్నారు.
మరికొందరు ఈ ఘటనపై హాస్యంగా స్పందించారు."జోక్ చేయడం వస్తే, జోక్‌ను తట్టుకోవడం కూడా రావాలి" అని ఒకరు కామెంట్ చేశారు.
"ఈ వ్యక్తికి పెళ్లి కాకూడదు.నేను వధువు తండ్రి అయితే, ఆయన్ని ఆస్పత్రి పాల చేసేవాడిని" అని మరొకరు అన్నారు.
ఈ వీడియో చూసిన చాలామంది వరుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యులర్ గా తింటే ఏం అవుతుంది?