కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ సీరం మీకోసమే!

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Dark circles ) ఏర్పడటం సర్వసాధారణం.చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.

 Super Effective Serum To Get Rid Of Dark Circles! Serum, Dark Circles Removing S-TeluguStop.com

కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఇవి చూసేవారికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.

పైగా అందాన్ని తగ్గిస్తాయి.మీరు కూడా ఈ నల్లని వలయాలతో బాధపడుతున్నారా.? అయితే అస్స‌లు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మిరాకిల్ సీరం మీకు అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ సీరంను వాడితే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు దెబ్బకు మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Dark Circles, Serum, Latest, Skin Care, Skin Care Tips-Telugu Healt

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు ఫ్రెష్ వేపాకు( Neem ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కుకుంబర్ జెల్ ను వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు వేపాకు జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Serum, Latest, Skin Care, Skin Care Tips-Telugu Healt

ఓ ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో కలిపితే మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న సీరంను కళ్ల చుట్టూ అప్లై చేసి కనీసం రెండు మూడు నిమిషాల పాటు సున్నితంగా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు కళ్ళను గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఈ విధంగా కనుక ప్రతిరోజూ చేస్తే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే కేవలం కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.నల్లటి వలయాలను సహజంగానే నివారించడానికి ఈ మిరాకిల్ సీరం చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

ఈ సీరం ను ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు.ఈ సీరం చర్మాన్ని గ్లోయింగ్ గా, షైనీ గా మారుస్తుంది.ముడతలను మాయం చేస్తుంది.మొండి మ‌చ్చ‌ల‌ను సైతం పోగొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube