ప్రపంచంలో ఏ మూల ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి భారతీయులు ముందుంటారు.భాష, ప్రాంతం, కులం, మతం అనే వాటిని పట్టించుకోకుండా సాయం చేస్తుంటారు.
తాజాగా ప్రముఖ గాయని నిఖితా గాంధీ( Singer Nikhita Gandhi ) లండన్‌లోని రాజస్థాన్ ఫౌండేషన్( Rajasthan Foundation ) అనే స్వచ్ఛందం సంస్థ నిర్వహించిన దివాళీ బాల్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.భిల్వారా, బార్మర్‌లోని ప్రభుత్వ పాఠశాలలు సహా రాజస్థాన్‌లో చిన్నారుల సమస్యల కోసం నిధులను సేకరించేందుకు ఈ కచేరీని నిర్వహించారు.
ఐదు వేర్వేరు భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో పాటలు పాడిన నిఖిత.యూకేలోని( UK ) ప్రేక్షకుల ప్రతిస్పందనతో తాను పొంగిపోయానని తెలిపారు.విదేశాల్లో షో చేయడానికి తాను పలుమార్లు భయాందోళనకు గురైనట్లు నిఖిత చెప్పారు.విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా మనం భారతదేశంలో వింటున్న సంగీతాన్నే ఆస్వాదిస్తున్నారా లేక మరేదైనా కొత్తది కోరుకుంటున్నారా అని తాను అనుకుంటూ ఉండేదాన్నని ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
కానీ తన ప్రదర్శన చాలా సరదాగా, ఆహ్లాదకరంగా సాగిపోయిందని నిఖిత తెలిపారు.యూకేలోని భారతీయ కమ్యూనిటీ అన్ని రకాలుగా తనకు సహకరించిందని.కార్యక్రమానికి స్పందన బాగుందని ఆమె వెల్లడించారు.
రాజస్థాన్ ఫౌండేషన్ (టీఆర్ఎఫ్) ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో నిరుపేద స్త్రీలు , పిల్లల మధ్య పేదరికం, కష్టాలు , సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతోంది.కమ్యూనిటీ, సంస్కృతి, దాతృత్వం అనే అంశాల ద్వారా యూకేలోని రాజస్థానీ కమ్యూనిటీని ఒక చోటకి చేర్చడం దీని వెనుక లక్ష్యం.దివాళీ ఛారిటీ బాల్ 2024( Diwali Charity Ball 2024 ) కార్యక్రమంపై రాజస్థాన్ సంతతికి చెందిన పూనమ్ గోయెల్ మాట్లాడుతూ.
భిల్వారాలోని సోనా మనో వికాస్ కేంద్రంలో హోమ్ బేస్డ్ కార్యక్రమానికి మద్ధతుగా వేల పౌండ్‌లను సేకరించినట్లు తెలిపారు.బార్మర్ జిల్లాలోని గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్‌లో కొత్త బాలికల వాష్ రూమ్, క్లాస్ రూమ్ , డ్రింకింగ్ ఏరియాను పునర్నిర్మించడానికి ఈ నిధులు సహాయపడతాయని పూనమ్ చెప్పారు.
2005లో ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ సామాజిక ప్రయోజనాల కోసం నిధులను సేకరించే లక్ష్యంపై దృష్టి పెట్టింది.భిల్వారాలోని సోనా మనో వికాస్ కేంద్రం, జోధ్‌పూర్‌లోని నవజ్యోతి మనో వికాస్ కేంద్రం వంటి సంస్థలకు పూర్తి మద్ధతునిచ్చింది.