ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులను, భారతీయ కమ్యూనిటీని ఖచ్చితంగా పలకరించే వస్తారు ప్రధాని నరేంద్ర మోడీ.( PM Narendra Modi ) ఆయన కోసం ఎన్ఆర్ఐలు కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేసిన ఉదంతాలెన్నో.
తాజాగా బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో( Rio de Janeiro ) చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీ( Indian Community ) ఘన స్వాగతం పలికింది.దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
భారత త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని వారు ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా కొందరు పెయింటింగ్స్, ఇతర జ్ఞాపకాలను మోడీకి అందించే ప్రయత్నం చేశారు.
రక్షణ, సాంకేతికత, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోడీ అనంతరం బ్రెజిల్‌లో( Brazil ) అడుగుపెట్టారు.బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అధ్యక్షతన జరుగుతున్న జీ 20 సదస్సులో( G20 Summit ) పాల్గొనేందుకు మోడీ రియో డి జెనీరోకు వచ్చారు.బ్రెజిల్ , దక్షిణాఫ్రికాతో పాటు జీ 20లో భారత్ కీలక సభ్యదేశంగా ఉంది.
సోమవారం జరిగే సమ్మిట్ సందర్భంగా భారత్ నిర్వహించిన జీ20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ , వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ల ఫలితాల ఆధారంగా వివిధ అంశాలపై భారత్ వైఖరిని మోడీ ప్రపంచ దేశాధినేతలకు వివరిస్తారు.జీ 20 సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు ఇదే వేదికపై పలువురు దేశాధినేతలతో మోడీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.జీ20 సమ్మిట్ తర్వాత.ప్రధాని జార్జ్‌టౌన్‌కు వెళ్తారు.1968 తర్వాత ఓ భారత ప్రధాని తొలిసారిగా గయానాలో పర్యటించనున్నారు.
గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు నవంబర్ 19-21 మధ్య జరిగే పర్యటనలో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు గయానా పార్లమెంట్‌లో, ప్రవాస భారతీయులు నిర్వహించనున్న ఈవెంట్‌లో ప్రసంగించనున్నారు.గతేడాది ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్‌కు అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ కూడా లభించింది.