బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే మోజుతో చాలామంది ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లోనే వీరు రీల్స్ కోసం మూర్ఖత్వపు పనులకు పాల్పడుతున్నారు.

 Horse Walking In The Middle Of The Road Kicked Two Girls Riding A Scooty Video V-TeluguStop.com

వీరి వల్ల ఇతరులు ప్రమాదాల్లో పడుతున్నారు.తాజాగా ఒక యువకుడు రీల్స్ కోసమని గుర్రంపై( Horse ) ఎక్కి రోడ్డుపైకి వచ్చాడు.

అయితే ఆ గుర్రం స్కూటీపై( Scooty ) వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను బలంగా తన్నింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ భయంకరమైన వీడియోలో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు యువతులను( Two Girls ) ఒక గుర్రం లాగిపెట్టి తన్నడం చూడవచ్చు.ఈ గుర్రం కిక్కు( Horse Kicked ) చాలా బలంగా ఉండటం వల్ల ఇద్దరు యువతులు రోడ్డుపై పడిపోయారు.

ఈ ఘటనలో ఆ యువతులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.ఇలా జరిగిన వెంటనే, గుర్రం యజమాని తన గుర్రాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘viral_ka_tadka’ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.దీన్ని ఇప్పటికే 13,000 మందికి పైగా చూశారు.ఈ వీడియోలో, ఒక గుర్రం స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు యువతులపై దాడి చేసిన దృశ్యం కనిపిస్తోంది.

ఈ ఘటన తర్వాత గుర్రం యజమాని అక్కడి నుంచి పారిపోవడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఈ వీడియో ఒక ప్రాంక్ అని అనుమానిస్తున్నప్పటికీ, ఈ ఘటన ప్రజా రవాణాలో జంతువుల వల్ల కలిగే ప్రమాదాల గురించి మనకు తెలియజేస్తోంది.

రోడ్డుపై జంతువులను నియంత్రించడానికి కఠిన చట్టాలు అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక కుక్క లాంటి పెంపుడు జంతువులను కూడా కొంతమంది బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకువచ్చి ఇతరుల ప్రాణాలకు హాని తల పెడుతుంటారు.

జంతువుల యజమానులు చేసే నిర్లక్ష్యపు పనులను అరికట్టాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube