తగ్గుతున్న భారతీయ విద్యార్ధులు.. ఆర్ధిక సంక్షోభంలో యూకే యూనివర్సిటీలు

భారతీయ విద్యార్ధులు ఉన్నత విద్య కోసం విదేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు.భారతీయ యువతకు ఫేవరెట్ డెస్టినేషన్స్‌లో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశాలున్నాయి.

 Uk Universities Face Financial Crisis As Indian Student Numbers Drop , Uk Univer-TeluguStop.com

వీటిలో ఎక్కువగా యూకే యూనివర్సిటీలున్నాయి.ఇంగ్లాండ్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా.

దాదాపు 100 ఏళ్ల పైనుంచే భారతీయ విద్యార్ధులు ఇంగ్లీష్ గడ్డపై ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

యూకే యూనివర్సిటీల మనుగడకు, బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధకు భారతీయ విద్యార్ధులు వెన్నెముక లాంటి వారని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారంటే మన పిల్లల స్థాయేంటో చెప్పొచ్చు.

అయితే పరిస్ధితులు, పెరుగుతున్న వలసల కారణంగా యూకే ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ( UK Government Immigration )విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తోంది.ఇది విద్యారంగంపైనా ప్రభావం చూపుతోంది.

ఈ క్రమంలో భారతీయ విద్యార్ధులు యూకే యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మానేస్తున్నారు.ఇది యూకే విద్యా వ్యవస్ధపై ప్రభావం చూపుతుందని ఓ నివేదిక చెబుతుంది.

Telugu America, Australia, Canada, Financial, Germany, Indian National, Indian,

2022-23 నుంచి 2023-24 వరకు యూకే ప్రొవైడర్ల అధ్యయనాలకు అనుమతికి సంబంధించి యూకే హోమ్ ఆఫీస్ డేటా ఆధారంగా శుక్రవారం విడుదల చేసిన ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్ అధ్యయనం .భారతీయ విద్యార్ధుల సంఖ్య 20.4 శాతం తగ్గుదలని చూపిస్తోంది.ఇది 1,39,914 నుంచి 1,11,329కి తగ్గింది.

యూకేలోని కొన్ని నగరాల్లో ఇటీవలి ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా ఈ తగ్గుదల నమోదైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Telugu America, Australia, Canada, Financial, Germany, Indian National, Indian,

అంతర్జాతీయ విద్యార్ధులకు జారీ చేయబడిన మొత్తం స్పాన్సర్‌షిప్‌లలో 11.8 శాతం క్షీణతను చూపుతోంది.దేశాలను బట్టి ఈ తగ్గుదలలో వ్యత్యాసం కనిపిస్తోంది.

భారత్, నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల విద్యార్ధులపై ఎక్కువగా ఆధారపడే యూకే యూనివర్సిటీలు గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (యూకే) మాత్రం ఈ నివేదిక తమకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది.

విదేశీ విద్యార్ధులు వారిపై ఆధారపడిన వ్యక్తులు, జీవిత భాగస్వాములను యూకేకు తీసుకురావడానికి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నందున ఆశ్చర్యం అనిపించలేదని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube