టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపికి( YCP ) చెందిన అనేకమంది కీలక నేతలపై కేసులు నమోదవడం , అరెస్టులు చోటు చేసుకోవడం తెలిసిందే.ఇక సోషల్ మీడియా విషయంలోనూ టిడిపి కూటమి ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది.
ఇప్పటికే వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతోమందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశారు.గత వైసిపి ప్రభుత్వం టిడిపి ,జనసేన కీలక నేతలే టార్గెట్ గా, వైసిపి కి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు చెలరేగి న విధానంపై అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న రెండు పార్టీల అధినేతలు అధికారంలోకి వచ్చిన తరువాత దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యతలను తీసుకున్నారు.
అంతేకాకుండా సోషల్ మీడియా దుర్వినియోగం చేయకుండా కఠిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి ,జనసేన అధినేతలను టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగిన అప్పటి మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై( Kodali Nani ) ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కొడాలి నానిని అరెస్టు చేస్తారని, మొదటి టార్గెట్ ఆయనే అనే ప్రచారం జరిగినా, సైలెంట్ గానే టీడీపీ , జనసేన పెద్దలు ఉన్నారు.తాజాగా విశాఖలో ఓ విద్యార్థిని కొడాలి నాని భూతులతో మనస్థాపం చెందాను అని ఆయనపై కేసు పెట్టారు.
దీనిపై నాని పై కేసు నమోదయింది .ఈ కేసులో చర్యలు తీసుకుని నాని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం కొడాలి నాని రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.
పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు.అసలు గుడివాడలోనే( Gudivada ) ఆయన కనిపించడం లేదు.తాను రాజకీయాలకు పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చాను అనే ప్రచారం తమ అనుకూలం మీడియా ద్వారా చేయించుకుంటున్నారు .ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) కూడా పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు.ఆయన పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు.
గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేయడంలో కొడాలి నాని , వల్లభనేని వంశీలు ముందుండేవారు .టిడిపి అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టినా , వదిలిపెట్టకపోయినా వీరిద్దరినీ వదిలిపెట్టబోయేదే లేదు అంటూ అప్పట్లో టిడిపి నాయకులు సవాళ్లు చేసేవారు.ఇప్పుడు కొడాలి నానిపై కేసు నమోదు కావడం తో ఆయన్ను అరెస్టు చేసి మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.