కోకో పౌడర్..
దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కాకో బీన్స్ ద్వారా తయారు చేసే కోకో పౌడర్‌ను.
చాక్లెట్స్, కేక్స్, కుక్కీస్ లలో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోకో పౌడర్.
చర్మ సౌందర్మాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది.అందుకే సౌందర్య ఉత్పత్తుల్లోనూ దీనిని వినియోగిస్తుంటారు.
అంతే కాదండోయ్. కేశ సంబంధిత సమస్యలను వదిలించడంలోనూ కోకో పౌడర్ ఉపయోగపడుతుంది.

అవును, ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్కులను ట్రై చేస్తే మస్తు హెయిర్ కేర్ బెనిఫిట్స్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి ఆలస్యమెందుకు ఆ హెయిర్ మాస్కులు ఏంటీ.? వాటిని ఎలా తయారు చేసుకోవాలి.? అసలు వాటిని వాడటం వల్ల ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కోకో పౌడర్, ఒక ఫుల్ ఎగ్ మరియు ఒక స్పూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు w హెయిర్ మాస్క్‌ను జుట్టు మొత్తానికి పట్టించి.ముప్పై నిమిషాల పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలి.ఆపై కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో ఒక్క సారి చేశారంటే వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఉండవు.
జుట్టుకు బలం చేకూరి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వాటర్, ఒక కప్పు మందారం పూల రేకులను వేసి బాగా హిట్ చేసుకోవాలి.ఆపై చల్లార బెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ ఎండబెట్టుకుని పొడి చేసుకున్న కరివేపాకు, అర స్పూన్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి.అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఈ మాస్క్ వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది.చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు జుట్టు రాలడం, పొట్లిపోవడం వంటివి తగ్గుతాయి.