టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోయిన్ శోబిత ధూళిపాల( Sobhita Dhulipala ) త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుక కూడా ముగిసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.వచ్చేనెల అనగా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదు లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి వేడుక చాలా ఘనంగా జరగనుంది.
వీటితోపాటు ఇంకా అనేక రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

తాజాగా నాగ చైతన్య-శోభిత ల వెడ్డింగ్ కార్డు( Wedding Card ) బయటికి వచ్చింది.అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శోభిత పేరు, తర్వాత చైతు పేరు తో ఈ వివాహ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేయించారు.4th డిసెంబర్ 2024 అంటూ పెళ్లి తేదీని అందులో పొందుపరిచారు.నాగ చైతన్య తల్లితండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున, అమల, ఆ తర్వాత VLK శాస్త్రి, లక్ష్మి కమల అంటే చైతు తల్లి అలాగే స్టెప్ ఫాదర్ పేర్లను ముద్రించారు.

నాగ చైతన్య వెడ్డింగ్ కార్డుని నాగార్జున( Nagarjuna ) సినీ రాజకీయ ప్రముఖులకు పర్సనల్ గా అందిస్తూ పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం చైతు, శోభితల వెడ్డింగ్ కార్డు నెట్టింట సంచలనంగా మారింది.ఆ వెడ్డింగ్ కార్డు చూసిన అభిమానులు అయితే పెళ్లి పనులు మొదలైనట్లు ఉన్నాయి.వీరి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ అన్ని అవాస్తవాలు అన్న మాట అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ జంట పెళ్లి ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.పెళ్లి డేట్ ని వాయిదా వేశారంటూ కూడా వార్తలు వినిపించాయి.తాజాగా వీరి పెళ్లి కార్డు కు సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.







