తమ స్కిన్ కలర్ ను మెరుగుపరుచుకోవాలని చాలా మంది తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
తోచిన చిట్కాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పు పోయే న్యాచురల్ క్రీమ్ స్క్రీన్ వైట్నింగ్ కు( Skin Whitening Cream ) ది బెస్ట్ వన్ గా వర్కౌట్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) మరియు ఐదు బాదం గింజలు( Almonds ) వేసి వాటర్ తో రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఆపై అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యం మరియు పొట్టు తొలగించిన బాదం గింజలను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టీ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.
నిత్యం ఈ క్రీమ్ ను కనుక ఉపయోగిస్తే స్కిన్ కలర్ అద్భుతంగా పెరుగుతుంది.మీ ఫేస్ వైట్ అండ్ బ్రైట్ గా మారుతుంది.
అంతేకాకుండా ఈ క్రీమ్ మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా ప్రోత్సహిస్తుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది.
టాన్ ను రిమూవ్ చేస్తుంది.మరియు చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది.







