కరోనాను గోల్డెన్‌ మిల్క్‌తో చెక్ పెట్టవచ్చా..?

కొన్ని రోజుల నుంచి కరోనా అందర్నీ నిద్రపోనీకుండా చేస్తోంది.చాలా మంది కరోనాకు బలైపోతున్నారు.

 Carona Virus, Covid 19, Golden Milk, Health Care, Health Benifits,home Made-TeluguStop.com

దీనివల్ల ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయుర్వేదంపై చాలా మంది ఫోకస్ పెట్టారు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంటి నివారణలు, ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు.కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం చాలా అవసరం.

వైద్యులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పలు సూచనలు చేస్తుంటారు.సరైన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు.

అయితే ఇటువంటి తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి బంగారు పాలను చాలా ఇళ్లలో వినియోగిస్తున్నారు.వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బంగారు పాలను తినాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.

పాశ్చాత్య దేశాలలో బంగారు పాలకు డిమాండ్ పెరిగింది.ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

’గోల్డెన్ మిల్క్’ అని పిలువబడే ఈ పానీయాన్ని ‘పసుపు పాలు’ అంటారు.జలుబు, దగ్గు, శరీర నొప్పులు, గాయాలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి.

పసుపు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.గత సంవత్సరం కరోనా వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు పసుపు పాలు తాగాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

దేశవ్యాప్తంగా 135 ప్రదేశాలలో 104 కి పైగా సామాజిక అధ్యయనాలను నిర్వహించింది.దీని ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిని పాటిస్తున్నారు.ఉదయం 10 గ్రాముల, ఒక టీస్పూన్ చ్యవాన్‌ప్రాష్, సారం వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.రోజుకు ఒకటి లేదా రెండుసార్లు హెర్బల్ టీ తాగాలని లేదా తులసి, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, అల్లం, ఎండుద్రాక్ష సారం సేకరించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

అలాగే, 150 మి.లీ వేడి నీటిలో అర టీస్పూన్ పసుపు వేసి తాగాలని సూచించారు.కర్కుమిన్ అనే పదార్ధం పసుపులో పెద్ద పరిమాణంలో లభిస్తుంది.చికాకు, ఒత్తిడి, నొప్పి అనేక ఇతర రకాల సమస్యలను తొలగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube