అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగా( Sandeep Reddy Vanga ) ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండడం విశేషం… అలాగే తనకంటూ ఇక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.మరి ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక మెట్టు పైకి ఎక్కించడానికి చాలావరకు ప్రయత్నం చేస్తున్నాడనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలు కొంచెం బోల్డ్ కంటెంట్ తో ఉంటాయని చాలామంది విమర్శలు చేసినప్పటికి ఆయన సినిమాల మీద మాత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

మరి ఆ సినిమాలు ప్రేక్షకులను చేరుకోవడమే కాకుండా మంచి సక్సెస్ ను సాధించడంలో కూడా కీలక పాత్ర వహిస్తూ రావడం విశేషం.ఇక ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా తన సినిమాల హవా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా( Animal Movie ) సూపర్ సక్సెస్ అయింది.1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక ఇప్పటికి కూడా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే పాన్ వరల్డ్ లో ( Pan World ) కూడా తను సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రతి ప్రేక్షకుడిలో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక ఇదిలా ఉంటే సందీప్ సినిమా డైరెక్టర్ కాకపోతే ఆయన వరంగల్ లో పత్తి మార్కెట్లో పత్తి కొంటూ ఉండేవాడిని ఒక సందర్భంలో తెలియజేశాడు.ఇక ఎందుకంటే వాళ్ళ నాన్నకి పత్తి కొని అమ్మే మార్కెట్ ఉంది.
కాబట్టి తను కూడా అదే బిజినెస్ ను చూసుకునేవాడని చెబుతుండడం విశేషం…
.