సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎంతో కామన్.పలువురు హీరోలు, హీరోయిన్లు తాము నటించిన సినిమాల ద్వారా దగ్గరై మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సందర్భాలు కోకొల్లలుగా చూశాం.
ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా చాలామంది తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు.అందులో కొందరు సింగర్స్ తమ తోటి సింగర్స్ ని, మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్నారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మల్లిఖార్జున్-గోపిక పూర్ణిమ
సింగర్ మల్లికార్జున్ తెలుగులో ఎన్నో సినిమాల్లో పాటలు పాడాడు.ఇదే సమయంలో పరిచయం అయినా సహ సింగర్ గోపిక పూర్ణిమాతో ప్రేమలో పడ్డాడు.సీన్ కట్ చేస్తే 2008లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
హేమచంద్ర- శ్రావణ భార్గవి

టాలీవుడ్ లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న హేమచంద్ర తన సహ సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద వాళ్ళు సైతం ఒప్పుకున్నారు.వీరి వివాహం ఘనంగా జరిపించారు.
టిప్పూ- హరిణి

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ టిప్పూ కూడా తన కో సింగర్ హరిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈమె తెలుగులో 100కి పైగా సాంగ్స్ పాడింది.
తమన్- శ్రీ వర్దిని

తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సింగర్ శ్రీ వర్దిని ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.ఈమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.