ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోచింగ్ తీసుకుని మంచి ఉద్యోగాలు సాధించడమే ఎంతో కష్టం అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఒక యువకుడు మాత్రం కోచింగ్ లేకుండానే పోటీ పరీక్షల్లో సత్తా చాటడం ద్వారా వార్తల్లో నిలిచారు.
కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు( 8 Govt Jobs ) సాధించి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు.వరంగల్ లోని నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
పంచాయితీ సెక్రటరీ ( Panchayat Secretary )ఉద్యోగంతో పాటు పీజీటీ గురుకుల, ఏ.ఎస్.వో, టీజీటీ గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్2, గ్రూప్4, డీఎస్సీ, జేఎల్ ఇలా వరుసగా ప్రభుత్వ పోటీ పరీక్షలలో సత్తా చాటిన రాజేశ్ తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.ప్రస్తుతం రాజేశ్ మల్లంపల్లిలో పీజీటీగా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.
రాజేశ్ తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్4 జాబ్ సాధించారని సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రాజేశ్( Rajesh ) ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని చెప్పవచ్చు.రాజేశ్ లక్ష్యాన్ని నమ్ముకుని కష్టపడటం వల్లే ఈ స్థాయికి చేరుకోవడం సాధ్యమైందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
రాయరాకుల రాజేశ్ బాల్యం నుంచి చదువులో ముందువరసలో ఉండేవారని సమాచారం అందుతోంది.సరైన పద్ధతిలో ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందని రాజేశ్ తన ప్రతిభతో ప్రూవ్ చేశారు.రాయరాకుల రాజేశ్ ను నెటిజన్లు సైతం తెగ మెచ్చుకుంటున్నారు.అతనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే ఉన్నత లక్ష్యాలను సాధించడం సాధ్యమేనని రాజేశ్ సక్సెస్ స్టోరీతో సులువుగా అర్థమవుతుంది.పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించాలంటే సరైన విధంగా ప్రిపేర్ కావడం కూడా ముఖ్యమేనని చెప్పవచ్చు.