30 నిమిషాల్లో ఢిల్లీ టూ అమెరికా.. అసలేమీ జరుగుతోంది? (వీడియో)

ఢిల్లీ నుంచి అమెరికాకు( Delhi to America ) కేవలం 30 నిమిషాల్లో తీసుకెళ్లే అంతరిక్ష నౌకను త్వరలో తయారు చేశాల కనిపిస్తన్నాడు ఎలాన్ మాస్క్( Elon Mask ) .ప్రస్తుతం మస్క్ మనకు పగటి కలలు కనడానికి ప్రయత్నిస్తున్నాడని అనిపించవచ్చు.

 Delhi To America In 30 Minutes, Social Media, Viral Video, Space X, Elon Mask, S-TeluguStop.com

కానీ, అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందనిపిస్తోంది.ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ కూడా దీని కోసం పని ప్రారంభించింది.

ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాలను 1 గంటలోపు చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనడం మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ స్టెయిన్‌ లెస్ స్టీల్‌తో( SpaceX with stainless steel ) తయారు చేసిన 395 అడుగుల అంతరిక్ష నౌకను కూడా సిద్ధం చేసింది.సహజంగానే ఉక్కుతో తయారు చేయబడినందున ఇది చాలా తేలికగా ఉంటుంది.డొనాల్డ్ ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత, తన స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ‘ఎర్త్ టు ఎర్త్’ ( Earth to Earth )అంతరిక్ష యాత్రను సాధ్యం చేస్తానని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ఇదే జరిగితే రవాణా ప్రపంచంలోనే అద్భుతం.

పది ఏళ్ల క్రితమే స్టార్‌షిప్ కోసం స్పేస్‌ఎక్స్ ప్లాన్ చేసింది.ఓ నివేదిక ప్రకారం, భూమిపై అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 1000 మందిని కక్ష్యలోకి తీసుకెళ్లే ప్రణాళిక ఉంది.అయితే, అంతరిక్షంలోని చీకటిలోకి వెళ్లకుండా ఈ స్టార్‌షిప్ భూమికి సమాంతరంగా ఎగిరి, మరొక మూలలో అంటే ఏదైనా ఇతర నగరంలో ల్యాండ్ అవుతుంది.

ఈ స్టార్‌షిప్ లాస్ ఏంజెల్స్ నుండి టొరంటోకి 4,061 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో కవర్ చేస్తుంది.ఇది ప్రస్తుతం విమానంలో ప్రయాణించడానికి 4 గంటలకు పైగా పడుతుంది.

అదేవిధంగా, లండన్ నుండి న్యూయార్క్‌కు 5,567 కిలోమీటర్ల దూరాన్ని కూడా కేవలం 29 నిమిషాల్లో అధిగమించవచ్చు.ఇది ప్రస్తుతం 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది.ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు 12,341 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవడానికి ప్రస్తుతం విమానంలో 15.35 గంటలు పడుతుంది.ఇది కాకుండా.న్యూయార్క్ నుండి షాంఘైకి 11,858 కిలోమీటర్ల దూరాన్ని ప్రస్తుతం విమానంలో ప్రయాణించడానికి 14.50 గంటలు పడుతుంది.అది కూడా కేవలం 39 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

ఇకపోతే ఈ వ్యోమనౌకలో కూర్చున్న ప్రయాణీకులు గురుత్వాకర్షణను అనుభవిస్తారు.ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో దిం అనుభూతి ఉంటుంది.

ఇది మాత్రమే కాదు, తక్కువ గురుత్వాకర్షణ కారణంగా వారు ఫ్లైట్ సమయంలో కూడా సీట్ బెల్ట్ ధరించాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube