తెలుగు ప్రేక్షకులకు టాప్ సింగర్స్ అయినా అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా( Anurag Kulkarni, Ramya Behara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వీరిద్దరూ ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరూ అభిమానులకు ఒకసారిగా ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ చెప్పా పెట్టకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచారు.తాజాగా వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటేనట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లో శుక్రవారం ఈ వేడుక జరిగింది.ఇది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది.అయితే ఈ సీక్రెట్ ప్రేమ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల ( Family members and close friends )సమక్షంలో వీళ్ల వివాహం జరిగినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొత్తజంటకు తోటీ గాయనీ గాయకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇంకొందరు ఇలా ఉన్నఫలంగా సీక్రెట్ గా ఎవరిని పిలవకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతున్నారు.ఇంకొందరు మాత్రం నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇకపోతే అనురాగ్ కులకర్ణి విషయానికి వస్తే.ఆయన పాడిన పాటలలో కేరాఫ్ కంచరపాలెం సినిమాలో ఆశా పాశం అనే పాట అలాగే ఆర్ఎక్స్ 100 లో పిల్ల రా అనే పాటలు ఆయనకు భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
అయితే అంతకుముందు సూపర్ సింగర్ 8వ సీజన్ విజేతగా నిలవడంతో ఇతనికి భారీగా గుర్తింపు దక్కింది.ప్రస్తుతం సినిమాలకు పాటలు పాడుతూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అనురాగ్ కులకర్ణి.ఇకపోతే రమ్య బెహరా విషయానికొస్తే.సూపర్ సింగర్ 4లో పాల్గొంది.ఈమెను కీరవాణి.టాలీవుడ్ కు పరిచయం చేశారు.
బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి లాంటి ఎన్నో సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి హిట్స్ అయ్యాయి.ఇప్పుడు ఈమె తోటి సింగర్ నే పెళ్లి చేసుకోవడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు.
రీసెంట్గా వీళ్లిద్దరూ కలిసి పాడిన పాట హే రంగులే.ఇది ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.