తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సింగర్ సునీత( Singer Sunitha ) ఒకరు.ఈమె అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి సింగర్ గా అడుగుపెట్టి అనంతరం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ లందరికీ కూడా డబ్బింగ్ చెబుతూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్న సునీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.అయితే ఇటీవల ఈమె వైజాగ్ రావడంతో వైజాగ్ గురించి సునీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంగీతం( Music ) అనేది భగవదత్తంగా రావాలి.నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది.స్వరం మాత్రం జన్మతహా వస్తుంది.సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి.సంగీతాన్ని ప్రేమించాలని తెలిపారు.ఇక వైజాగ్ గురించి ఈమె మాట్లాడుతూ మా అమ్మ వాళ్ళది విశాఖపట్నం ఆమె చిన్నప్పటి నుంచి వైజాగ్( Vizag ) గురించి ఎంతో అద్భుతంగా చెప్పడంతో ఓహో వైజాగ్ అంటే ఇలా ఉంటుందని నేను ఊహించుకొనే దానిని సునీత తెలిపారు.
ఇలా తరచూ అమ్మ చెప్పే మాటలు విని నాకు తెలియకుండానే నేను వైజాగ్ ప్రేమలో పడ్డాను అని తెలిపారు.

నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది.కైలాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి.మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ప్రకృతి అంతా కూడా ఈ వైజాగ్ లోనే ఉంటుందా అనిపిస్తుంది ఎంతైనా వైజాగ్లో ఉండే ప్రజలు చాలా అదృష్టవంతులు ఇక నేను కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కావడంతో నేను కూడా అదృష్టవంతురాలి నేనని సునీత తెలిపారు.
నాకు సముద్రాలన్నా కొండలు అన్న ప్రకృతి అంటే చాలా ఇష్టమని తెలిపారు.ఇలా ప్రకృతి నడుమ ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతానని సునీత వెల్లడించారు.విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయని సునీత వైజాగ్ అందాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







