లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మనందరికీ తెలిసిందే.నయనతార( Nayantara ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.
కాగా ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు గడిచిన కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే రాణిస్తోంది.అంతేకాకుండా ఇప్పటివరకు ఈమె తన కెరియర్ లో దాదాపుగా 75కు పైగా సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఈమె చేతులు నాలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

కాగా నేడు నయనతార 40 పుట్టినరోజు వేడుకలను( Nayantara Birthday ) జరుపుకుంది.ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మొదట సినిమాలన్నా, నటన అన్న ఆమెకు ఇష్టం లేదట.
ఆమె మోడలింగ్ చేసే సమయంలో మలయాళ సినిమాలో అవకాశం రాగా మొదట వద్దు అనుకున్నప్పటికీ తర్వాత సినిమాలో నటించిందట.ఒకవేళ ఆమె నటి కాకపోయి ఉంటే లెక్చరర్ గానో లేదంటే కళాకారునిగా స్థిరపడేదట.
లేదంటే ఆమెకు ఎంతగానో ఇష్టమైన చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదట.

కేవలం మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తాను రొటీన్ రోల్స్ ప్లే చేయను అని తెలిపింది నయనతార.బిల్లా సినిమాలో( Billa Movie ) బికినీ క్యారెక్టర్ లో నటించాను మళ్లీ అలా నటించకూడదనేసి తెలుగు సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేశాను అని తెలిపింది నయనతార.తెరపైన నటించే సెలబ్రిటీలకు కూడా బాధలు ఉంటాయి.
ఒక టైమ్ లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాను.కానీ ఆ బాధల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది సినిమాలే అని ఆమె తెలిపింది.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







