అడవిలో మంటను ఎలా పుట్టించాడో.. ఇది మాములు క్రియేటివిటీ కాదు, భయ్యో!

ప్రపంచంలో ఎంతటి పెద్ద సమస్య తలెత్తినా, దానికి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది.కానీ ఆ పరిష్కారాన్ని కనుక్కోవాలంటే ఓపికగా ఉండాలి.

 How He Started A Fire In The Forest.. This Is Not Ordinary Creativity, My Dear,-TeluguStop.com

కొంతమంది మాత్రం, ఒక సమస్యకు పరిష్కారం కనిపెట్టే ప్రయత్నంలో మరో కొత్త సమస్యను క్రియేట్ చేస్తారు.ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి ఓ ప్రాబ్లమ్ మేకర్ వీడియో వైరల్ గా మారింది.

అడవిలో మనుగడ కోసం ఉపయోగపడే ఓ లైఫ్ హ్యాక్ అంటూ అతను ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ వీడియోల్లో జంగల్‌లో మంట ఎలా రాజేయాలో చూపిస్తారు.

అడవిలో మంట వెలిగించే ఒక కొత్త పద్ధతిని చూపిస్తారు.ఈ రకమైన కొత్త పద్ధతులను ‘లైఫ్ హ్యాక్స్’ అంటారు.

ఈ హ్యాక్స్ మన జీవితాన్ని సులభతరం చేయడానికి, కష్టమైన పరిస్థితుల్లో బతికి మనుగడ సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటారు.కానీ ప్రస్తుత వైరల్ వీడియోలో కనిపించింది నిజమైన లైఫ్ హ్యాక్‌లా కనిపించడం లేదు.

ఈ వీడియోలో కనిపించినట్లుగా ఒక వ్యక్తి జంగల్‌లో మంట( Fire ) వెలిగించడానికి చాలా విచిత్రమైన పద్ధతిని ఉపయోగించాడు.అతను తన చెప్పులోంచి ఒక చిన్న ముక్కను బ్లేడ్ తో కట్ చేసి, దానిలో ఒక అగ్గిపెట్టెని ఉంచాడు.

ఆ తర్వాత, అగ్గిపుల్లల్ని రుద్దే భాగాన్ని తన చెప్పుకు అంటించాడు.అలా చేసి అగ్గి పుల్లని చెప్పుకు రుద్దితే, అది వెలిగి మంటను పుట్టించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.చాలా మంది ఈ పద్ధతిని చూసి ఆశ్చర్యపోయారు.కొంతమంది ఈ పద్ధతి వరస్ట్ గా ఉందని, అసలు సమస్య లేకుండా ఉన్నప్పుడు కొత్త సమస్యను సృష్టించిన్నట్లు ఉందని అన్నారు.మరొకరు, కర్రసామాన్లు కనుక్కొనే ముందు మనుషులు ఇలాంటి పద్ధతులను ఉపయోగించేవారేమో అని హాస్యంగా అన్నారు.

కొందరు మాత్రం ఈ పద్ధతిని విమర్శించారు. అగ్గిపెట్టె లేదా లైటర్ (Match box, liter)తీసుకెళ్లడం చాలా సులభం అని, ప్రతి అగ్గిపెట్టెను చెప్పుకు అంటించడం అనవసరం అని అన్నారు.

ఈ పద్ధతి క్రియేటివ్‌గా ఉండొచ్చు కానీ, చాలా మందికి ఇది యూజ్‌లెస్‌గానే అనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube