యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.తారక్ సినిమాలు థియేటర్లలో విడుదలైతే తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి.
అయితే దేవర సినిమాకు( Devara ) సంబంధించి భారీ ఈవెంట్లు నిర్వహించే విషయంలో మేకర్స్ ఫెయిలయ్యారు.ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై కూడా కొంతమేర పడిందని చెప్పవచ్చు.
అయితే బన్నీని( Bunny ) చూసి ఎన్టీఆర్ నేర్చుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బీహార్ రాజధాని పాట్నాలో తాజాగా పుష్ప ది రూల్( Pushpa The Rule ) ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈవెంట్ కు గెస్ట్ లు సైతం లేకపోయినా పుష్ప ది రూల్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం గమనార్హం.పుష్ప ది రూల్ ట్రైలర్ మరీ అద్భుతంగా లేకపోయినా మినిమం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల కోసం తారక్ మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తర్వాత సినిమాల ప్రమోషన్స్( Movie Promotions ) విషయంలో తారక్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.తారక్ అద్భుతమైన కథలను ఎంచుకుంటున్నా ప్రమోషన్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో జరగడం లేదు.ఫలితంగా తారక్ లక్ష్యాలు నెరవేరడం లేదనే చెప్పాలి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరిమితంగా తీసుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ దేవర2 సినిమాలో నటించకపోతే బెటర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నరు.
ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.ఎన్టీఆర్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.