పనీర్.పాల నుంచి వచ్చేదే అయినా పాల కంటే రుచిగా ఉంటుంది.అందుకే పనీర్‌తో ఎన్నో వంటకాలు చేస్తుంటారు.ముఖ్యంగా మన భారతీయులు.పనీర్ కర్రీ, పనీర్ ఫ్రై, పనీర్ టిక్కా, పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా ఇలా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తుంటారు.పనీర్‌తో ఏ వంటకం చేసినా.
లొట్టలేసుకుని తినాల్సిందే.ఇక రుచిలోనే కాదు.
పనీర్‌లో ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం, కాల్షియం, సోడియం, పాటాషియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే పనీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే కొందరు పనీర్‌ను పచ్చిగా తింటుంటారు.కానీ, కొందరు మాత్రం పచ్చిగా తినేందుకు భయపడుతుంటారు.అయితే పచ్చి పనీర్‌ను తినొచ్చా అంటే.నిశ్చితంగా తినమంటున్నారు నిపుణులు.ఎందుకంటే, రా పనీర్ తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్‌ను పచ్చిగా తినడం వల్ల శరీరానికి కాల్షియం ఎక్కువగా అందుతుంది.దాంతో ఎముకలు, దాంతులు మరియు కండరాలు దృఢంగా మారతాయి.చాలా మంది పనీర్ తింటే బరువు పెరిగి పోతామని భయపడుతుంటారు.కానీ, పచ్చి పనీర్ తీసుకుంటే.
అందులో ఉండే లినోలెయిక్ ఆమ్లం శరీరంలో కొవ్వు కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

పనీర్‌ను పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.దాంతో నీసరం, అలసట, తలనొప్పి వంటివి తగ్గు ముఖం పడతాయి.ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలతో ఇబ్బంది పడే వారు పచ్చి పనీర్ తీసుకోవడం చాలా మంచిది.
ఇక పనీర్‌ను పచ్చిగా తీసుకోవడం వల్ల చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.అయితే గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే.పచ్చి పనీర్ హెల్త్‌కు మేలు చేసినప్పటికీ.పరిమితి మించితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.