సూపర్ సిక్స్ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అమలు చేసే విషయంలో విఫలం అయిందని బిఆర్ఎస్ అదే పనిగా విమర్శలు చేస్తూనే వస్తోంది .ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్ కీలక నాయకులంతా విమర్శల దాడి చేస్తున్నారు.
ఒకవైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) రేవంత్ రెడ్డిని అన్ని విషయాల్లోనూ టార్గెట్ చేస్తున్నారు .రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీ విషయంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో పాటు,
ఫార్మా బాధితులు, రైతులతో కలిసి ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసేందుకు కేటీఆర్ నడుం బిగించారు.ఈరోజు ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ ఫార్మా కంపెనీ విషయంలో జాతీయ ఎస్సీ , ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.తాజాగా హరీష్ రావు( Harish Rao ) రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు.
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో డక్ అవుట్ అయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే , మాజీమంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు.ఈరోజు తుర్కయాంజల్ లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు 10 ఏళ్లలో కెసిఆర్ తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని,
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మరో 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని హరీష్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీ ల దందా బంద్ చేసి , మూసి దుకాణాన్ని తెరిచారని రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు.నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
పేదలతో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ చేసుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని , ఆరు గ్యారంటీల విషయంలో రేవంత్ రెడ్డి డక్ అవుట్ అయ్యారని హరీష్ రావు మండిపడ్డారు.
కేసీఆర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారని హరీష్ రావు అన్నారు.