ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది ఏపీలోని అధికార కూటమి(Kutami) ప్రభుత్వం.గత వైసిపి(YCP) ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తునే , అన్ని ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునేందుకు టిడిపి(TDP) అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి వస్తూ , ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు అందించాల్సిందిగా కేంద్ర పెద్దలను కోరుతూ వస్తున్నారు.2027 లోనే జమిలి ఎన్నికలు(Jamili elections) రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల హామీలన్నిటిని ముందుగానే అమలు చేయడం ద్వారా మరోసారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమం ఈ రెండిటిని సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
రాబోయే జమిలి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ తమ కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపాలంటే కచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోటమి పార్టీల నేతలు భావిస్తున్నారు .దీనిలో భాగంగానే ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్(Free Gas Cylinder) పథకానికి శ్రీకారం చుట్టారు.ఈ పథకానికి ప్రజల నుంచి భారీగా స్పందన రావడం, ఇది కూటమి ప్రభుత్వానికి మరింత మైలేజ్ తీసుకురావడంతో, మహిళలను(Women) దృష్టిలో పెట్టుకుని మరిన్ని పథకాలను అమలు చేసి , రాబోయే ఎన్నికల్లో మహిళల మద్దతు తమకు పూర్తిస్థాయిలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు(Free BUS) ప్రయాణం పై రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో.చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరుపై తెలంగాణ , కర్ణాటకలో అధికారుల బృందం అధ్యయనం చేసి వచ్చింది.
ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.దీనికోసం నిధులను సిద్ధం చేసుకుంటున్నారు .అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలలో పురుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుగానే వాటి పరిష్కార మార్గాలను అన్వేషించి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.