న్యూయార్క్ కచేరీలో సింగర్ పైకి డాలర్లు విసిరిన అభిమానులు.. పాటను ఆపేసి మరీ? (వీడియో)

ఆయుష్మాన్ ఖురానా (ayushmann khurrana)తన పాటలతోనే కాకుండా తన యుఎస్ (US)పర్యటనలో తన వినయంతో కూడా హృదయాలను గెలుచుకుంటున్నాడు.తన బ్యాండ్ ‘ఆయుష్మాన్ భవ’తో చికాగో, న్యూయార్క్, శాన్ జోస్(Chicago, New York, San Jose) వంటి నగరాల్లో ప్రదర్శనలు ఇస్తున్న ఈ నటుడు-గాయకుడు అమెరికాలో తన రెండవ సంగీత కచేరీలో అభిమానుల నుండి విపరీతమైన స్పందనను పొందారు.

 Fans Threw Dollars At Singer At New York Concert.. Stopped The Song? (video), So-TeluguStop.com

కానీ, అతని న్యూయార్క్ కచేరీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.ఒక అభిమాని అతన్ని వేదికపై ప్రశంసించడానికి డాలర్ల వర్షం కురిపించాడు.

దాంతో ఆయుష్మాన్ ఖురానా(Khurrana) ఆ సమయంలోనే కచేరీని ఆపి, ఆ డబ్బును ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వమని అభిమానిని కోరాడు.దింతో ఆయుష్మాన్ క్లిప్ వైరల్ అయ్యింది.దీని కారణంగా అతను సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు అందుకుంటున్నాడు.ఆయుష్మాన్ అమెరికా టూర్ ఎనిమిదేళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికపైకి తిరిగి వచ్చాడు.ఐదు నగరాల పర్యటనలో చికాగో, న్యూయార్క్, శాన్ జోస్, న్యూజెర్సీ, డల్లాస్ నగరాలలో జరుగుతున్నాయి.

ఇకపోతే, ఆయుష్మాన్ తదుపరి బ్లాక్‌బస్టర్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగమైన మాడాక్ ఫిల్మ్స్ రాబోయే ‘థమా’(Thama)లో కనిపించనున్నాడు.2025 దీపావళికి విడుదల కానుంది.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఆయనను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

చాలా మంది ఆయన సరైన పని చేసారని కామెంట్ చేస్తున్నారు.మరోవైపు ఇలాంటి చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి సోషల్ మీడియాలో.‘లైవ్ కాన్సర్ట్‌లో ఇలాంటి అగౌరవాన్ని చూడటం నిరాశపరిచింది.ఆయుష్మాన్ ఖురానా ఇటీవలి NYC కచేరీ సందర్భంగా, అతను పాడుతున్నప్పుడు ఒక అభిమాని వేదికపై డాలర్లను విసిరాడు.

ఆ వ్యక్తి సంగీతాన్ని ఆస్వాదించడానికి బదులుగా, తన సంపదను తప్పుడు మార్గంలో చూపించాడని తెలిపాడు.అలాగే, అతను ఆయుష్మాన్ చూపిన వినయం, సమాధానమిచ్చే విధానాన్ని కూడా ప్రశంసించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube