బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను అరెస్టు చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులు వినిపిస్తూనే వస్తోంది. దీపావళి కే ఆయనను అరెస్ట్ చేస్తారని తీవ్రంగా ప్రచారం జరిగింది.
దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు.ఏదో ఒక అంశంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న కేటీఆర్ ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే తమకు ఇబ్బందులు ఉండమని కాంగ్రెస్ (Congress)నేతలంతా భావించారు.
ఈ మేరకు కేటీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన శాఖలలోని అవినీతి వ్యవహారాలను బయటకు తీసి ఆయనను అరెస్ట్ చేస్తే, మిగతా నేతలు సైలెంట్ అయిపోతారని భావించిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి , అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఇప్పుడు వరకు ఆ అవినీతికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టలేకపోయారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లోనూ చర్చ జరిగిందట.కేటీఆర్(KTR) ను ఏదో ఒక విషయంలో జైలుకు (Jail)పంపాల్సిందేనని కొంతమంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారట.ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ నిధుల విడుదలకు సంబంధించి నిబంధనకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని, ఈ విషయంలో కేటీఆర్ సైతం అంగీకరించడంతో ఆయన అరెస్టు తప్పదని అంతా భావించారు .కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం కూడా లేఖ రాసింది.ఈ విషయంలోనే ఆయనను అరెస్టు చేయబోతున్నారనే హడావుడి జరుగుతున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్ల ఘటన చోటు చేసుకోవడం, ఫార్మసిటీ కోసం భూసేకరణ పై లగచర్ల వ్యవహారం తీవ్ర దమారాన్ని రేపడం , లగచర్లలో కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపై రైతులు దాడికి పాల్పడడం వంటి వాటి వెనుక కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న సురేష్ (Suresh)అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Narendra reddy)కి అనేకసార్లు ఫోన్ కాల్ చేశారని, స్వయంగా కేటీఆర్ తో మాట్లాడారని ఆ తర్వాత దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ విషయంలోనూ కేటీఆర్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు వినిపించినా, కేటీఆర్ ను ఈ విషయంలో అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని, లగచర్ల అంశం రైతులతో ముడిపడి ఉండడం, అరెస్టు అయిన వారంతా ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కాంగ్రెస్ ఈ విషయంలో వెనకడుగు వేసిందట.ఈ విషయంలో కేటీఆర్ ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని , లంబాడ సామాజిక వర్గం, రైతులlo కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు సానుభూతి బాగా పెరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వెనక్కి తగ్గారట.